హైదరాబాద్: 1,266 రోజులుగా ఓటమి అన్నదే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు 10 ఏళ్ల గోల్ఫర్ ఆర్యమాన్ సింగ్. ఇండియన్ గోల్ఫ్ యూనియన్ వెస్ట్ జోన్లో ఈ ఏడాది వరుసగా ఐదు ఈవెంట్లు గెలిచాడు.
దీంతో జూనియర్స్ విభాగంలో జోనల్, నేషనల్ స్థాయిలో తన రికారుల్ని తానే అధిగమించాడు. జోనల్ స్థాయిలో గత నాలుగేళ్లుగా ఆర్యమాన్‌కు ఓటమన్నదే లేదు. తద్వారా తన విజయ పరంపర రికార్డు 1,266 రోజులుగా సాగుతోంది.
భారత జూనియర్ గోల్ఫ్ చరిత్రలోనే ఇదో అద్భుతమైన రికార్డు. దీనికి సంబంధించిన వివరాలను ఆర్యమాన్ సింగ్ తన ఫేస్బుక్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.
ఈ ఏడాది తాను పాల్గొన్న మొట్టమొదటి కెన్స్విల్లే గోల్ఫ్‌కోర్స్ (అహ్మదాబాద్) ఈవెంట్‌తో ప్రారంభమైన విజయ పరంపర ఆ తర్వాత పూనా క్లబ్ గోల్ఫ్ కోర్స్, ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ అండ్ కంట్రీక్లబ్ (పూణె), గైక్వాడ్ బరోడా గోల్ఫ్ కోర్స్ (వడోదర), గుల్మొహర్ గ్రీన్ గోల్ఫ్ కోర్స్(అహ్మదాబాద్) వరకు సాగింది.
ఇలా వరుసగా నాలుగు సార్లు గుల్మొహర్ గ్రీన్ గోల్ఫ్ కోర్స్‌ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. అంతేకాదు తాను పాల్గొన్న ప్రతి ఈవెంట్లో గెలవడమే తన ప్రత్యేకత అని ఆర్యమాన్ చెప్పుకొచ్చాడు.