న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారి సరసన రోహిత్ శర్మ: ముంబై వర్సెస్ చెన్నై ఫైనల్ హైలైట్స్

By Srinivas

ముంబై: ఐపీఎల్ 8 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ గెలుచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. చెన్నై సారథి ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏ దశలోను ఛేదించే దిశగాకనిపించలేదు. చెన్నై ఎనిమిది వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసింది.

ముంబై ఇండియన్స్ జట్టు సిక్స్‌లు - 12, ఫోర్లు - 16
టాప్ స్కోరర్ - లెండిల్ సిమన్స్ 68 (45 బంతుల్లో 8x4, 3x6)
తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) - ముంబై 61/1
ముంబై ఇండియన్స్ 5.1 ఓవర్లలో 50 పరుగులు, 10.1 ఓవర్లలో వంద పరుగులు, 16 ఓవర్లలో 150 పరుగులు, 19.5 ఓవ్లలో 200 పరుగులు చేసింది.
ఎక్కువ పరుగులు వచ్చి ఓవర్ - నెహ్రా వేసిన 17వ ఓవర్, 23 పరుగులు ఇచ్చాడు.

Highlights: IPL 2015 Final - CSK Vs MI in Kolkata

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిక్స్‌లు - 6, ఫోర్లు - 16
టాప్ స్కోరర్ - డ్వేన్ స్మిత్ 57 (48 బంతుల్లో 9x4, 1x6)
తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) - చెన్నై 31/1
చెన్నై సూపర్ కింగ్స్ 8 ఓవర్లలో 50 పరుగులు, 13.4 ఓవర్లలో వంద పరుగులు, 19.4 ఓవర్లలో 150 పరుగులు చేసింది.

ఎక్కువ వికెట్లు తీసింది - మెక్‌లెనగన్, 4 ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసి 25 పరుగులు ఇచ్చాడు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్ - రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్‌కు ఇది రెండో ఐపీఎల్ టైటిల్. 2013లో తొలిసారి గెలిచింది. ఇదే కోల్‌కతా వేదిక పైన టైటిల్ దక్కించింది. ఇప్పుడు కూడా అదే వేదికపై టైటిల్ గెలిచింది.

కోల్‌కతా (2012, 2014), చెన్నై (2010, 2011) తర్వాత రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన జట్టు ముంబై.

గత ఐదు సీజన్లుగా లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టు టైటిల్ దక్కించుకుంటుంది. ఐపీఎల్ 8లో లీగ్‌లో ముంబై రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

పైనల్లో చెన్నై తరఫున టాప్ స్కోరర్ డ్వేన్ స్మిత్ (57). ఆ తర్వాత సురేష్ రైనా 28 పరుగులు.

చెన్నై కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ చేసింది 18 పరుగులు.

ముంబై జట్టులో మెక్‌లెగాన్ నాలుగు ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 25 పరుగులు ఇచ్చాడు. లసిత్ మలింగ, హర్భజన్ సింగ్ చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు.

203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేలా చెన్నై ఏ దశలోను కనిపించలేదు. తొలి ఆరు ఓవర్లలో ఆ జట్టు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది.

ముంబై జట్టులో పార్థివ్ పటేల్ అవుటయ్యాక.. సిమన్స్ - రోహిత్ శర్మ రెండో వికెట్‌కు 11.1 ఓవర్ వరకు 119 పరుగులు చేశారు.

సిమన్స్‌ ఫైనల్లో అర్ధ సెంచరీ చేశాడు. అతడికి ఈ సీజన్లో ఇది ఆరో అర్ధ సెంచరీ. అతను 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతను 68 (45 బంతుల్లో 8x4, 3x6)కు అవుటయ్యాడు.

రోహిత్ శర్మ 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 26వ బంతికి పెవిలియన్ చేరాడు. అతను ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టాడు.

పొలార్డ్ 18 బంతుల్లో రెండు ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 పరుగులు చేశాడు.

అంబటి రాయుడు 24 బంతుల్లో మూడు సిక్స్‌లతో 36 పరుగులు చేశాడు.

చెన్నై తరఫున అధిక వికెట్లు తీసింది డ్వేన్ బ్రావో. అతను నాలుగు ఓవర్లలో 2 వికెట్లు తీసి 36 పరుగులు ఇచ్చాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X