సిడ్నీ: కొద్ది పాటి నిర్లక్ష్యమే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ప్రాణం మీదికి తెచ్చిందనే మాట వినిపిస్ోతంది. ఆధునీకరించిన హెల్మెట్ ధరించి ఉంటే గాయం ప్రాణాలు తీసేంత తీవ్ర స్థాయిలో ఉండేది కాదనే వాదన వినిపిస్తోంది. మంగళవారంనాటి మ్యాచులో హ్యూస్ పాత మోడల్ హెల్మెట్ ధరించాడని బ్రిటన్‌కు చెందిన హెల్మెట్ల తయారీ సంస్థ మసూరీ తెలిపింది.
తాము షెఫిల్డ్ షీల్డ్ మ్యాచుల కోసం బ్యాట్స్‌మెన్‌కు రక్షణపరంగా ఆధునీకరించిన హెల్మెట్లను అందుబాటులోకి తెచ్చామని, హ్యూస్ మాత్రం తమ కంపెనీకి చెందిన పాత హెల్మెట్‌ను ధరించాడని ఆ సంస్థ తెలిపింది. హ్యూస్ గాయం తాలూకు వీడియో ఫుటేజీని పరిశీలిస్తే అతను కొత్త మోడల్ హెల్మెట్ ధరించి ఉండాల్సిందని అనిపించిందని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు.
హ్యూస్కు చెవి కింద, హెల్మెట్ గ్రిల్ వెనుక భాగంలో బంతి తగిలింది. తలనకు అత్యంత ప్రమాకరంగా పరిణమించే ఈ ప్రదేశాన్ని హెల్మెట్ పూర్తిగా రక్షించలేదని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు. అయితే, కొత్త హెల్మెట్ ధరించి ఉంటే హ్యూస్కు ప్రమాదం తప్పి ఉండేదా అనే ప్రశ్నకు అతను సూటిగా సమాధానం చెప్పలేదు. 2013లో అందుబాటులోకి వచ్చిన తమ కొత్త మోడల్ హెల్మెట్ బ్యాట్స్‌మన్‌కు అదనపు రక్షణ కల్పిస్తుందని చెప్పారు. అదే సమయంలో మెడను అనువుగా తిప్పేందుకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు.
కొత్త హెల్మెట్‌లో మసూరీ సంస్థ చేసిన మార్పు చిన్నదే. అయితే కొత్త మోడల్ హెల్మెట్‌లో హ్యూస్కు బౌన్సర్ తగిలిన భాగాన్ని గ్రిల్‌తో పూర్తిగా కవర్ చేశారు. హ్యూస్ ధరించిన పాత హెల్మెట్ గ్ర్లిస్ బ్యాట్స్‌మన్ చెవులను పాక్షికంగా మాత్రమే కవర్ చేస్తుంది. కొత్త హెల్మెట్‌లో గ్రిల్స్ పొడిగించారు. చెవులను మాత్రమే కాకుండా గ్రిల్స్ చెవుల కింది భాగాన్ని కూడా కొంత మేర కవర్ చేస్తాయి.