న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనితో స్నేహం, సచిన్ లాగా బ్యాటింగ్: సెహ్వాగ్

By Nageswara Rao

న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేసేందుకు తనను తాను చాలా మార్చుకున్నట్లు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో తన చిన్నతనంలో 10, 12 ఓవర్లు ఉండే మ్యాచ్‌లను ఎక్కువగా ఆడేవాడేనని సెహ్వాగ్ తెలిపారు.

ఆ సమయంలో ఎక్కువగా తాను మిడిల్ ఆర్డర్‌లో ఆడేవాడినని తెలిపిన సెహ్వాగ్ అదే బ్యాటింగ్ శైలిని అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో ఆడానని తెలిపారు. అందుకే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో తన స్ట్రైక్ రేటు 80 లేదా 90కు తగ్గకుండా ఉండేదని పేర్కొన్నారు. జట్టులో స్ధానం లభించినప్పుడు త్వరగా ఎక్కువ పరుగులు సాధించాలనే తపనతో కాకుండా నెమ్మదిగా ఆడాలనే ప్రయత్నం చేశానన్నారు.

అచ్చం సచిన్ లాగే బ్యాటింగ్ చేయాలని అనుకున్నానన్నారు. ఆ తర్వాత క్రికెట్‌లో ఒకే ఒక టెండూల్కర్ ఉంటాలంటూ, తిరిగి తన పాత ఆటనే కొనసాగించినట్లు తెలిపారు. తన ఆట తీరును మార్చుకోవాలనే గేమ్‌లో స్పీడ్‌గా ఆడటం నేర్చుకున్నానన్నారు. ఆ తర్వాత నా సొంత టెక్నిక్‌తో బ్యాటింగ్ చేశానని చెప్పారు.

I wanted to bat like Sachin Tendulkar, says Virender Sehwag

37 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ భారత్ తరుపున 104 టెస్టు మ్యాచ్‌లాడి 8686 పరుగులు చేయగా, 251 వన్డేల్లో 8273 పరుగులు చేశారు. దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టు నుంచి ఇటీవలే హర్యానా జట్టుకు మారిన సెహ్వాగ్ రాష్ట్ర అసోసియేషన్లు సక్సెస్ పుల్‌గా నడలేకపోతున్నారని అన్నారు. ఇది ఒక ఢిల్లీకే పరిమితం కాదన్నారు. చాలా అసోసియేషన్స్ ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు.

రాష్ట్ర అసోసియేషన్‌లో కీలక పాత్ర పోషించ్ అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు గాను అలాటింటిదేమీ లేదని జవాబిచ్చారు. నాకు సొంతంగా సెహ్వాగ్ ఇంటర్నేషన్ స్కూల్ ఉందన్నారు. అందుకే రాష్ట్ర అసోసియేషన్‌లో పాలుపంచుకోలేకపోతున్నానని అన్నారు. చాలా రాష్ట్ర అసోసియేషన్లు నన్ను సెలక్టర్‌గా ఉండాలని కోరుతున్నా దానిని సున్నితంగా తిరస్కరిస్తున్నానని అన్నారు.

మనదేశంలో చాలా మంది నైపుణ్యం కలిగిన క్రికెటర్ల ఉన్నారని, కానీ అలాంటి వారికి సెలక్టర్లుగా అయ్యే అవకాశం రావడం లేదన్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది యువ ఆటగాళ్లకు చక్కని వేదిక అని కితాబిచ్చారు. 2000-01 కాలంలో నేను జట్టులోకి వచ్చినప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆడేందుకు సుమారు 20 మ్యాచ్‌లకు వేచి చూసేవాళ్లని అన్నారు.

అదే ఐపీఎల్‌లో అడిన శిఖర్ ధావన్‌ లాంటి వారు ఫేస్‌ను ఎదుర్కొని అరంగేట్రమైన టెస్టులో ఆస్టేలియాపై 180 పరుగులు సాధించాడన్నారు. క్రికెట్ ద్వారా చాలా డబ్బు సంపాధించానని, అయితే డబ్బు కోసమే క్రికెట్ ఆడటం లేదన్నారు. కామెంటేటరీ, లేదా ఆర్టికల్స్ రాసిన లేక న్యూస్ ఛానెల్‌లో క్రికెట్‌కు సంబంధించిన వార్తల్లో పాల్గొని ఇప్పటికీ నేను డబ్బు సంపాదించే అవకాశం ఉందన్నారు.

ధోనికి నాకు మధ్య మంచి వాతావరణం ఉందన్నారు. ధోనితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కానీ మీడియానే మా మాధ్య అగాథం ఉన్నట్లు చూపిస్తోందన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు ధోనికి నేను థాంక్స్ చెప్పలేదని చాలా మంది అన్నారని, కానీ నా సహచరులందరికీ థాంక్స్ చెప్పానని అన్నారు.

భవిష్యత్ ప్రణాళిక గురించి చెబుతూ కోచ్‌గా, మెంటార్‌గా, బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తానన్నారు. తాను ఎక్కువగా హిందీలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని, ఎందుకంటే ఇంగ్లీషుతో పోలిస్తే భారత్‌లో ఎక్కవ మంది హిందీకే ప్రాధాన్యత ఇస్తారని తెలిపాడు. యువ క్రికెటర్లతో తన సలహాలు తప్పక ఉంటాయన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X