న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెటర్లలో టాప్ 9లో సచిన్ టాప్, కోహ్లీ లాస్ట్! టాప్ కోటీశ్వర్లు వీరే (పిక్చర్స్)

By Srinivas

న్యూఢిల్లీ: భారత దేశంలో వ్యాపారవేత్తలు, సినీ తారలు, క్రికెటర్లు... ఇలా చాలామంది కోటీశ్వరుల జాబీతాలో ఉంటారు. అయితే, క్రికెట్లో తక్కువ మంది ఉంటారు.

ప్రస్తుతం క్రికెటర్లు బాగా ఆర్జిస్తున్నారు. బాగా ఆడే ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాగే, వివిధ కంపెనీలకు ఎండోర్స్ ద్వారా పోగు చేసుకుంటున్నారు. ధనవంతుల జాబితాలో టాప్ క్రికెటర్లు వీరే...

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్.. 115 మిలియన్ డాలర్లతో ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

 సౌరవ్ గంగూలీ

సౌరవ్ గంగూలీ

బెంగాల్ టైగర్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ... 55.5 మిలియన్ డాలర్లతో ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

ధోనీ

ధోనీ

భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. 51 మిలియన్ డాలర్లతో క్రికెట్ క్రోర్‌పతి జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 28 ఏళ్ల తర్వాత 2007లో భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. ఈ ప్రపంచకప్‌లోను సారథిగా ఉన్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

డాషింగ్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్.. 45 మిలియన్ డాలర్లతో ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

 యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

ఇటీవల ఐపీఎల్ వేలంలో యువరాజ్ సింగ్ రూ.16 కోట్లకు అమ్ముడుపోయాడు. గత ఏడాది రూ.14 కోట్లు పలికి రికార్డ్ సృష్టించి... ఈసారి 16 కోట్లు పలికి తన రికార్డ్ తానే బద్దలు కొట్టుకున్నాడు. రూ.35.5 మిలియన్ డాలర్లతో యువరాజ్ అయిదో స్థానంలో ఉన్నాడు.

 యూసుఫ్ పఠాన్

యూసుఫ్ పఠాన్

యూసుఫ్ పఠాన్ 26.5 మిలియన్ డాలర్లతో ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.

రాహుల్ ద్రావిడ్

రాహుల్ ద్రావిడ్

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ 22.6 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. మిస్టర్ డిపెండబుల్, మిస్టర్ కూల్‌గా క్రికెట్‌లో పేరు తెచ్చుకున్నాడు. మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ద్రావిడ్.. ఇప్పుడు కోచ్‌గా, మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్... 20 మిలియన్ డాలర్లతో ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

 విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

డేరింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ... 15 మిలియన్ల డాలర్లతో ధనవంతుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. క్రికెట్‌‍తో, అనుష్క శర్మతో డేటింగ్, తన స్టయిల్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే కోహ్లీ ధనవంతుల జాబితాలోను ఉన్నాడు. ధోనీతో పోటీగా పలు కంపెనీల ప్రకటనలలో కనిపిస్తున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X