న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా-సఫారీ సిరీస్‌కు ప్రత్యేక గోల్డ్ టాస్ కాయిన్

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ కోసం బిసిసిఐ ప్రత్యేకంగా టాస్ కాయిన్(నాణేం)ను రూపొందించింది. 20 గ్రాముల బరువు గల ఈ నాణెమును స్వచ్ఛమైన వెండితో బంగారు పూత పూసి తయారు చేయించారు.

కాగా, ఈ నాణెంపై గాంధీ, దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా చిత్రాలను ముద్రించినట్టు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. నాణెం బొమ్మ భాగంపై గాంధీ, మండేలా చిత్రాలను, బొరుసు భాగంపై భారత్, క్రికెట్ సిరీస్ లోగోను ముద్రించారు.

India-South Africa series: Special Gandhi-Mandela gold coin for tosses

శుక్రవారం రాత్రి భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభంకానుంది. రాత్రి 7 గంటల నుంచి ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి ట్వంటీ20 మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, దక్షిణాఫ్రికా కెప్టెన్లు ధోనీ, డుప్లెసిస్ లతో కలసి బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ టాస్ కాయిన్‌ను ఆవిష్కరిస్తారు. ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్‌కు ఇదే టాస్ కాయిన్‌ను ఉపయోగిస్తారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X