న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్రౌండ్‌లో టాప్ స్కోర్: ఉత్కంఠ రేపి చేజార్చారు, రోహిత్ పోరాటం వృథా

By Srinivas

కాన్పూర్: కాన్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ వన్డేలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓడింది. చివరి మూడు బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ, ఆ వెంటనే బిన్నీ అవుట్ కావడంతో మ్యాచ్ జారిపోయింది. రోహిత్ శర్మ చివరి దాకా నిలబడి ఆకట్టుకున్నాడు. అతను 133 బంతుల్లో 155 పరుగులు చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.

అంతకుముందు...

బ్యాటింగ్‌కు దిగిన అమ్లా - డికాక్ ఆచితూచి ఆడారు. అయితే, ధోనీ ఆ తర్వాత స్పిన్నర్లను బరిలోకి దించడంతో... తొలి వికెట్ పడింది. స్పిన్‌ బౌలర్‌ అశ్విన్‌ మరోసారి కెప్టెన్‌ ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు.

India vs South Africa 1st ODI: Du Plessis fifty steadies South Africa

ప్రత్యర్థి వికెట్‌ అవసరమైన సమయంలో ధోని మొదట చూసేది బౌలర్‌ అశ్విన్ వైపే. ఈ వన్డేలో భారత్‌ పేసర్లపై ఎదురుదాడికి దిగుతున్న దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డికాక్‌ని కట్టడి చేసేందుకు ధోనీ అశ్విన్‌ని రంగంలోకి దింపగా.. తాను వేసిన తొలి ఓవర్లోనే డికాక్‌ని ఔట్‌ చేసి తానేంటో నిరూపించుకున్నాడు అశ్విన్.

దక్షిణాఫ్రికా 45 పరుగుల వద్ద డికాక్ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడిన డికాక్‌ (29) అశ్విన్‌ బౌలింగ్‌లో బంతిని ప్లిక్‌ చేయబోయి స్లిప్‌లో సురేష్ రైనాకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తర్వాత హసీమ్ ఆమ్లాను (37) బౌలర్ అమిత్ మిశ్రా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన అమిత్ బౌలింగులో డిఫెన్స్ ఆడబోయిన అమ్లా... బంతి అందకపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దక్షిణాఫ్రికా 104 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

India vs South Africa 1st ODI: Du Plessis fifty steadies South Africa

ఆ తర్వాత ఉమేష్ యాదవ్ బౌలింగులో డుప్లెసిస్ (62) అవుటయ్యాడు. డుబ్లెసిస్ 59 బంతుల్లో డుప్లెసిస్‌ 5X4, 1X6 సాయంతో 50 పరుగులు చేశాడు. అనంతరం ఆచితూడి ఆడుతున్న డప్లెసిస్‌ను ఉమేష్ ఎల్బీడబ్లుగా అవుట్ చేశాడు. ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌ వేసిన రైనా బౌలింగ్‌లో డుప్లెసిస్‌ బంతిని సిక్స్‌ రూపంలో స్టాండ్స్‌లోకి తరలించి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు దూకుడు పెంచుతుండటంతో ధోని మళ్లీ అశ్విన్‌కి బంతిని అందించాడు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఒక ఎండ్‌ నుంచి మిశ్రా, రైనాలను సఫారీ బ్యాట్స్‌మెన్లపై ప్రయోగిస్తూనే మరో ఎండ్‌లో అశ్విన్‌ని బౌలింగ్‌కి దింపి ప్రత్యర్థిని స్పిన్‌ ఉచ్చులోకి లాగేందుకు ధోని ప్రయత్నించాడు.

భారత్‌ స్పిన్‌ బౌలర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ వెన్నునొప్పి కారణంగా మైదానాన్ని వీడాడు. ఇన్నింగ్స్‌ 31వ ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన తర్వాత అశ్విన్‌ నొప్పి కారణంగా మైదానాన్ని వీడటంతో ఆ ఓవర్‌లో మిగిలిన రెండు బంతుల్ని విరాట్‌ కోహ్లి వేశాడు.

36 ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

India vs South Africa 1st ODI: Du Plessis fifty steadies South Africa

దక్షిణాప్రికా నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. భువనేశ్వర్ 10 ఓవర్లు వేసి 67 పరుగులు, ఉమేష్ 10 ఓవర్లు వేసి 71 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అశ్విన్ 4.4 ఓవర్లు వేసి 14 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. మిశ్రా 10 ఓవర్లు వేసి 47 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. బిన్నీ 8 ఓవర్లు వేసి 63 పరుగులు, రైనా ఏడు ఓవర్లు వేసి 37 పరుగులు, కోహ్లీ 0.2 ఓవర్లు వేసి 1 పరుగు ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో డివిల్లియర్స్ సెంచరీ (104) చేశాడు. డివిల్లియర్స్‌కు కెరీర్లో 21వ సెంచరీ. కాన్పూర్ మైదానంలో ఇదే అత్యధిక స్కోర్. డివిల్లియర్స్ తర్వాత.. డుప్లెసిస్ (62) చేశాడు.

భారత్ బ్యాటింగ్

భారత్ బ్యాటింగ్‌కు దిగింది. 42 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. 7.3 ఓవర్ వద్ద శిఖర్ ధావన్.. మోర్కెల్ బౌలింగులో ఎల్బీగా వెనుదిరిగాడు. శిఖర్ 28 బంతుల్లో 23 పరుగులు చేశాడు.

India vs South Africa 1st ODI: Du Plessis fifty steadies South Africa

భారత్‌ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ - అజింక్యా రహానె నిలకడగా ఆడారు. వీరిద్దరూ తొలి 51 బంతుల్లో 50 పరుగులు చేశారు. 31 ఓవర్లు ముగిసే వరకు భారత్ కేవలం ఒకటే వికెట్ కోల్పోయి 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 88 బంతుల్లో 93 పరుగులు, రహానే 70 బంతుల్లో 52 పరుగులు చేశారు.

రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 98 బంతుల్లో అతను సెంచరీ చేశాడు. 37 ఓవర్లు ముగిసే సమయానికి రోహిత్ శర్మ 105 బంతుల్లో 103 పరుగులు, విరాట్ కోహ్లీ 7 బంతుల్లో 5 పరుగులు చేశారు. భారత్ రెండు వికెట్లు కోల్పోయి 203 పరుగులతో ఉంది. ధావన్ (23), రహానే (60) వికెట్లు పోయాయి. రోహిత్ శర్మకు కెరీర్లో ఇది ఎనిమిదో సెంచరీ. 214 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (11) అవుటయ్యాడు.

సురేష్ రైనా ఆకట్టుకోలేకపోయాడు. అతను మూడు బంతుల్లో 3 పరుగులు చేశాడు. అంతకుముందు 150 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుటయ్యాక.. బ్యాట్సుమెన్ క్యూ కట్టారు. 46వ ఓవర్లోనే రోహిత్ శర్మ, రైనా అవుటయ్యారు. వీరు వరుసగా 269, 279 పరుగుల వద్ద అవుటయ్యారు.

ఆ తర్వాత 297 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా ధోనీ అవుటయ్యాడు. ఏడు పరుగుల దూరంలో ధోనీ అవుటయ్యాడు. చివరి మూడు బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా మ్యాచ్ ఉత్కంఠగా కనిపించింది. 49.4వ బాల్‌కు ధోని అవుటయ్యాడు. ఆ తర్వాత బంతికే బిన్నీ అవుటయ్యాడు. దీంతో, చివరి బంతిలో ఏడు పరుగులు చేయవలసి వచ్చింది. మొదటి నుంచి సౌతాఫ్రికాకు ధీటుగానే ఆడిన భారత్.. చివరకు చేజేతులా ఓడింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X