న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రసవత్తరం: ప్లేఆఫ్‌కు ఎవరూ చేరలేదు, ఇక ఎవరెవరు ఎవరితో?

By Srinivas

బెంగళూరు: ఐపీఎల్ 8లో ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు 47 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్లేఆఫ్ రేసులోకి ఒక్క జట్టు కూడా రాకపోవడం గమనార్హం. మరో తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారం రోజుల్లో గ్రూప్‌ దశ ముగియనుంది

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక్క జట్టు ప్లేఆఫ్‌ బెర్తు కూడా ఖరారు చేసుకోకపోవడం. అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్లు ఆడుతున్నాయి. పాయింట్ల పట్టికలో కుర్చీలాట కనిపిస్తోంది. తొలి నాలుగు స్థానాల కోసం ఆరు జట్ల మధ్య హరాహోరీ పోరు సాగుతోంది.

16 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉంది. 15 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో ఉంది. లీగ్‌లో మరో మూడు జట్లకు 16 పాయింట్లు సాధించే అవకాశమున్న నేపథ్యంలో ఇంకా ఏ జట్టుకూ ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు కాలేదు.

చెన్నై ఇంకొక మ్యాచ్‌ గెలిస్తే చాలు ప్లే ఆఫ్‌ను ఖాయం చేసుకుంటుంది. రెండు మ్యాచ్‌లు ఆడనున్న కోల్‌కతా, మూడు మ్యాచ్‌లు ఆడనున్న బెంగళూరు ఒక్కో మ్యాచ్‌ ఓడినా 17 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి.

సొంతగడ్డపై మూడు మ్యాచ్‌లు ఆడనున్న సన్‌రైజర్స్‌కు దాదాపుగా ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిందే. అది ప్రస్తుతం పన్నెండు పాయింట్లతో ఉంది. సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఓడితే ఆ జట్టు ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.

తొలి ఐదు మ్యాచ్‌లు బాగా ఆడిన రాజస్థాన్ రాయల్స్... ఆ తర్వాత వర్షం వల్ల మ్యాచ్‌లు రద్దై ఒక్కో పాయింటుతో సరిపెట్టుకున్నాక జోరు మందగించింది. రాజస్థాన్ ఆరు మ్యాచుల్లో నెగ్గి, వర్షం వల్ల రద్దైన రెండు పాయింట్లతో కలిసి పద్నాలుగు పాయింట్లతో ఉంది. అది మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా గెలవాలి.

ప్రస్తుతం రేస్ నుండి పంజాబ్, ఢిల్లీ తప్పుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మరో మ్యాచ్ నెగ్గితే ప్లే ఆఫ్ ఖరారు అయినట్లే. మిగతా రెండు జట్ల కోసం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఎక్కువ జట్లకు పదహారు పాయింట్లు వస్తే రన్ రేట్‌లో ముందున్న టీం ప్లే ఆఫ్‌కు వెళ్తుంది.

 IPL 2015: After 47 matches, still no team confirmed for playoffs

ప్రస్తుతం ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు ఆడాలి ఎన్ని పాయింట్లతో ఉన్నాయి?

1. చెన్నై (2 ఆడాల్సినవి, 16 పాయింట్లు)
2. కోల్‌కతా (2 ఆడాల్సినవి, 15 పాయింట్లు)
3. రాజస్థాన్ (1 ఆడాల్సినవి, 14 పాయింట్లు)
4. బెంగళూరు (3 ఆడాల్సినవి, 13 పాయింట్లు)
5. హైదరాబాద్ (3 ఆడాల్సినవి, 12 పాయింట్లు)
6. ముంబై (2 ఆడాల్సినవి, 12 పాయింట్లు)
7. ఢిల్లీ (2 ఆడాల్సినవి, 8 పాయింట్లు) - ప్లే ఆఫ్ నుండి ఔట్.
8. పంజాబ్ (3 ఆడాల్సినవి, 4 పాయింట్లు) - ప్లే ఆఫ్ నుండి ఔట్.

మిగతా మ్యాచ్‌లు ఎవరితో, ఎప్పుడు?

మ్యాచ్ 48 - 11 మే (సోమవారం) - హైదరాబాద్ Vs పంజాబ్ (హైదరాబాద్) సాయంత్రం 8 గంటలకు
మ్యాచ్ 49 - 12 మే (మంగళవారం) - ఢిల్లీ Vs చెన్నై (రాయపూర్) సాయంత్రం 8 గంటలకు
మ్యాచ్ 50 - 13 మే (బుధవారం) - పంజాబ్ Vs బెంగళూరు (మొహాలీ) సాయంత్రం 8 గంటలకు
మ్యాచ్ 51 - 14 మే (గురువారం) - ముంబై Vs కోల్‌కతా (ముంబై) సాయంత్రం 8 గంటలకు
మ్యాచ్ 52 - 15 మే (శుక్రవారం) - హైదరాబాద్ Vs బెంగళూరు (హైదరాబాద్) సాయంత్రం 8 గంటలకు
మ్యాచ్ 53 - 16 మే (శనివారం ) - పంజాబ్ Vs చెన్నై (మొహాలీ) సాయంత్రం 4 గంటలకు
మ్యాచ్ 54 - 16 మే - రాజస్థాన్ Vs కోల్‌కతా (ముంబై, బ్రాబోర్న్ స్టేడియం) సాయంత్రం 8 గంటలకు
మ్యాచ్ 55 - 17 మే (ఆదివారం) - బెంగళూరు Vs ఢిల్లీ (బెంగళూరు) సాయంత్రం 4 గంటలకు
మ్యాచ్ 56 - 17 మే - హైదరాబాద్ Vs ముంబై (హైదరాబాద్) సాయంత్రం 8 గంటలకు

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X