న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గర్ల్స్‌ను అలా ఎరవేస్తారు, జాగ్రత్త': అందుకే బస్సుల్లో క్రికెటర్లతో గర్ల్ ఫ్రెండ్స్

By Srinivas

ముంబై: అమ్మాయిలను ఎరగా వేసి బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఉసిగొల్పుతారని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ ఐపీఎల్ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసిందని తెలుస్తోంది. ఐపీఎల్ ఆటగాళ్లు హానీట్రాప్‌లో పడిపోకుండా ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్‌యూ) వివిధ ఫ్రాంచైజీలలోని ఆటగాళ్లకు పలు సూచనలు చేసిందంటున్నారు. బుకీలు ఎలా వల వేస్తారు, స్పాట్ ఫిక్సింగ్‌లో క్రికెటర్లను భాగస్వామ్యులను చేసేందుకు హానీట్రాప్‌కు ఎలా పాల్పడుతారో చెప్పారని తెలుస్తోంది.

సాధారణంగా బుకీలు యంగ్ స్టర్ లేదా డొమెస్టిక్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. మరీ ముఖ్యంగా అంతగా ఇమేజ్ లేని వారి వైపు దృష్టి సారిస్తారట.

IPL 2015: BCCI cautions players over spot fixing; explains how female fans are planted by bookies

సమాచారం మేరకు.. బుకీలు క్రికెటర్లను హానీట్రాప్‌లో పడేసేందుకు తొలుత అమ్మాయిని అభిమానిగా పంపిస్తారు. సదరు క్రికెటర్ తమతో సన్నిహితంగా ఉండేలా చేస్తారు. దానిని వీడియో తీస్తారు. బుకీలు ఏం అనుకున్నారో అది తమ వద్దకు వచ్చాక.. సదరు క్రికెటర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తారు. తాము చెప్పింది వినకుంటే ఎమ్మెమ్మెస్ లీక్ చేస్తామని బెదిరిస్తారు.

వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు బీసీసీఐ చెప్పినట్లుగా తెలుస్తోంది. అమ్మాయిలను ఎర వేస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు ఉసిగొల్పుతున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా క్రికెటర్లను తమ భార్యలతో, ప్రియురాళ్లు, గర్ల్ ఫ్రెండ్స్‌తో హోటల్లలో, బస్సులలో గడిపేందుకు సమయం ఇస్తున్నారని తెలుస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X