ముంబై: ఐపీఎల్ టోర్నమెంట్‌ను వరుస పరాజయాలతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు ముంబైలోని వాంఖడె మైదానంలో ముంబై ఇండియన్స్ Vs ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మధ్య మ్యాచ్ జరగనుంది.
రెండు జట్లు కూడా 9 మ్యాచ్‌లాడి పాయింట్ల పట్టికలో చెరో 8 పాయింట్లతో ఉన్నారు. కాకపోతే రన్ రేట్ భిన్నంగా ఉండటంతో పాయింట్ల పట్టిక స్దానాల్లోనే తేడా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 7వ స్ధానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ 5వ స్ధానంలో ఉంది.
ఈ ఏడాది ఐపీఎల్ వేలం పాటలో అత్యధిక ధర చెల్లించి ఢిల్లీ డేర్ డెవిల్స్ యువరాజ్ సింగ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు జరిగిన టోర్నమెంట్ మ్యాచ్‌ల్లో యువీ మాత్రం అంత ప్రదర్శనను కనబర్చలేదు.
అయితే ఢిల్లీ కెప్టెన్ జెపీ డుమినీ మాత్రం రూ. 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యువరాజ్ సింగ్‌కు బాసటగా నిలుస్తున్నారు. కాగా, ఈరోజు జరగనున్న మ్యాచ్‌లో ముంబై జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కారణం ముంబై జట్టు సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగడమే.
వాంఖడె స్టేడియంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు ముంబై, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. అందులో మూడు సార్లు ముంబై జట్టు గెలుపొందగా, ఒక్కసారి మాత్రమే ఢిల్లీ గెలుపొందింది.
ఎవరెవరు ఆడుతున్నారు?
ముంబై ఇండియన్స్ Vs ఢిల్లీ డేర్ డెవిల్స్
ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
ముంబై వాంఖడె స్డేడియం, ముంబై
మే 5 (మంగళవారం)
సాయంత్రం 8 గంటలకు
భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)
కీలక ఆటగాళ్లు?
ఢిల్లీ డేర్ డెవిల్స్ - జేపీ డుమిని, శ్రేయాస్ అయ్యర్, యువరాజ్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
ముంబై ఇండియన్స్ - రోహీత్ శర్మ, కీరన్ పోలార్డ్, హర్భజన్ సింగ్, లతిష్ మలింగ
రికార్డు
ఢిల్లీ డేర్ డెవిల్స్ - 8
ముంబై ఇండియన్స్ - 7
పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
ఢిల్లీ డేర్ డెవిల్స్ - నెంబర్. 5 (4 గెలుపు, 5 ఓటమి)
ముంబై ఇండియన్స్ - నెంబర్. 7 (4 గెలుపు, 5 ఓటమి)
జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), లసిత్ మలింగ, కీరాన్ పొల్లార్డ్, అంబటి రాయుడు (వికెట్‌కీపర్), హర్భజన్ సింగ్, కోరీ ఆండర్సన్, ఆదిత్య తారే, జస్ప్రీత్ బుంమ్రా, జోష్ హాజల్ఉడ్, మార్చాంట్లు డి లాంగే పవన్ సుయాల్, శ్రేయాస్ గోపాల్, లెండిల్ సిమన్స్, ఆరోన్ ఫించ్, ప్రజ్ఞాన్ ఓజా, మిఛెల్ మెక్‌గ్లాన్, అభిమన్యు మిథున్, ఐడెన్ మంచు తుఫాను, అక్షయ్, నితీష్ రానా, సిద్దేశ్ లాడ్, హ్యాడ్రిక్ పాండ్య, జగదీష్ సుజిత్, ఉన్ముక్త్ చంద్, వినయ్ కుమార్, పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్).
ఢిల్లీ డేర్‌డెవిల్స్: జేపీ డుమినీ (కెప్టెన్), మహ్మద్ షమీ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనోజ్ తివారీ, కేదార్ జాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సౌరభ్ తివారీ, జయంత్ యాదవ్, ఇమ్రాన్ తాహిర్, నాథన్ కౌల్టర్ నైల్, ఏంజెలో మాథ్యూస్ యువరాజ్ సింగ్, అమిత్ మిశ్రా, జైదేవ్, గురిందర్ సంధు, శ్రేయాస్ అయ్యర్, గౌతం, ట్రావిస్ హెడ్, శ్రీకర్ భరత్, అల్బీ మోర్కెల్, మార్కస్ స్టోయిన్స్, జహీర్ ఖాన్, కేకే జియాస్, డొమినిక్ జోసెఫ్.