న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్వాలిఫయిర్ 2: ధోనికి రాంచీ అభిమానుల మద్దతు, ఫామ్‌లో బెంగుళూరు..?

By Nageswara Rao

రాంచీ: ఐపీఎల్‌ క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మే 22న (శుక్రవారం) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

అందుకు కారణం చెన్నై కెప్టెన్ ధోని సొంత మైదానమైన రాంచీలో ఈ మ్యాచ్ జరగనుండటమే. ఐపీఎల్‌లో శుక్రవారం జరగనున్న మ్యాచ్ నాకౌట్ గేమ్. ఎవరైతే ఈ మ్యాచ్‌లో గెలుస్తారో ఆ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఓడిన జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తుంది.

క్వాలిఫయిర్ 2లో గెలిచిన జట్టు ఇప్పటికే ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మే 24న (ఆదివారం) కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఐపీఎల్ 8వ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై జట్టు బెంగుళూరుని ఓడించింది.

దీంతో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి చెన్నై దిగనుంది. దీనికి తోడు చెన్నైకి రాంచీ అభిమానుల మద్దతు కలిసొచ్చే అంశం. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కూడా మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది.

ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ ఎడిషన్లలో చెన్నై ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు గెలిస్తే 6వ సారి ఫైనల్‌కు చేరిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ఇక బెంగుళూరు కూడా మూడోసారి ఫైనల్‌(2009, 2011)కు అర్హత సాధించిన జట్టుగా నిలుస్తుంది.

IPL 2015 Daily Guide: Qualifier 2 (Match 59) - Chennai Super Kings Vs Royal Challengers Bangalore

ఎవరెవరు ఆడుతున్నారు?
చెన్నై సూపర్ కింగ్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
జేఎస్‌సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం, రాంచీ
మే 22 (శుక్రవారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
చెన్నై సూపర్ కింగ్స్ - సురేష్ రైనా, డుప్లెస్, డ్వేన్ బ్రేవో, ధోని
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, మిచెల్ స్టార్క్


రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ - 11
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 7


ఈ సీజన్‌లో
చెన్నై సూపర్ కింగ్స్ - 2
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 0


జట్లు

చెన్నై సూపర్ కింగ్స్: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, బ్రెండన్ మెక్కలమ్, డ్వేన్ బ్రేవో, డ్వేన్ స్మిత్, ఫాఫ్ డు ప్లెసిస్, మాట్ హెన్రీ, శామ్యూల్ బద్రీ, మైఖేల్ హస్సీ, కైల్ అబోట్, ఆండ్రూ టై, పవన్ నెగి, ఆశిష్ నెహ్రా, బాబా అపరాజిత్, ఈశ్వర్ పాండే, మిథున్ మన్హాస్, మరింత రోనిత్, రాహుల్ శర్మ, అంకుశ్ బైన్స్ ఇర్ఫాన్ పతాన్, ప్రత్యూష్ సింగ్, ఏకలవ్య ద్వివేది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, నిక్ మాడిన్సన్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్, సందీప్ వారియర్, యోగేష్ టకావాలే, యుజ్వేంద్ర చాహల్, రిలీ రొస్సో, ఇక్బాల్ అబ్దుల్లా, మన్వీందర్ బిస్లా, మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుబ్రమణ్యం బద్రీనాథ్, డారెన్ సామీ, సీన్ అబోట్, డేవిడ్ వైసే, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, శిశిర్ భవానే, శ్రీనాథ్ అరవింద్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X