న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2015: ఫ్యాన్ పార్కులు - 25న నడియాడ్‌, 26న గుంటూరు

By Nageswara Rao

ముంబై: ఐపీఎల్ ఇండియాళ్ల సంబరం. ఈ సంబరాన్ని దేశంలోని క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసేందుకు బీసీసీఐ ఫ్యాన్ పార్కులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వారం ఈ ఫ్యాన్ పార్కులు గుజరాత్‌లోని నడియాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఏర్పాటు చేయనున్నారు.

ఈ వారంలో గుజరాత్‌లోని నడియాడ్ కాలేజి రోడ్డులో ఉన్న ఖేడా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌‌ ప్రాంగణంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని సాయినగర్‌లో ఉన్న బ్రహ్మానంద రెడ్డి స్టేడియం (బీఆర్ స్టేడియం)ను ఫ్యాన్ పార్కులుగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు.

దీంతో ఐపీఎల్‌లో ఏప్రిల్ 25న జరిగే మ్యాచ్‌లను గుజరాత్‌లో ఏర్పాటులో ఫ్యాన్ పార్కులో క్రికెట్ అభిమానులు వీక్షంచవచ్చు. అదే విధంగా 26న జరిగే మ్యాచ్‌లను గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్కులో మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఎంట్రీ ఉచితం. ఈ ఫ్యాన్ పార్కుల్లోకి అభిమానులను, నిర్వహకులు 2 గంటల ముందుగా అనుమతిస్తారు.

IPL 2015 Fan Parks in Nadiad and Guntur on April 25, 26

ఏప్రిల్ 25:

ముంబై ఇండియన్స్ Vs సన్ రైజర్స్ హైదరాబాద్ - (సాయంత్రం 4 గంటలకు)
చెన్నై సూపర్ కింగ్స్ Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - (సాయంత్రం 8 గంటలకు)

ఏప్రిల్ 26:

కోల్‌కత్తా నైట్ రైడర్స్ Vs రాజస్ధాన్ రాయల్స్ - (సాయంత్రం 4 గంటలకు)
ఢిల్లీ డేర్ డెవిల్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - (సాయంత్రం 8 గంటలకు)

పెప్సీ ఐపీఎల్ 2015ను దేశ వ్యాప్తంగా 12 వేదికల్లో నిర్వహించనున్నారు. దేశంలోని 15 నగరాల్లోని పబ్లిక్ ప్లేసులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వీక్షించేందుకు ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్స్‌లో అచ్చం స్టేడియం లాంటి అనుభూతినే ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫ్యాన్ పార్కుల్లో సుమారు 10,000 మంది వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పిల్లలు, మహిళలకు ప్రత్యేకంగా స్పెషల్ ఏరియాలను కూడా కేటాయించనున్నారు. స్టేడియంలో మాదిరే మ్యూజిక్, పుట్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంఛైజీలే ఈ బాధ్యతను తీసుకుంటున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X