న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాప్ ఆర్డర్ విజృంభించాలి: చెన్నై ఆటగాళ్లకు కోచ్ ఫ్లెమింగ్

By Nageswara Rao

రాంచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్‌లో గెలిచి ముంబైలో ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే చెన్నై జట్టులోని టాప్ ఆర్డర్ ఆటగాళ్లు రాణించాల్సి ఉందని జట్టు కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ సలహా ఇచ్చాడు. జట్టు సభ్యులంతా కలిసి కట్టుగా రాణించి క్వాలిఫయిర్ 2లో విజయం సాధించాలని అన్నారు.

"మా బ్యాట్స్‌మెన్లు తప్పు సమయంలో పెవిలియన్‌కు చేరుతున్నారు. గత ఐపీఎల్‌తో ఈసారి మా ఆటగాళ్లు సరైన రీతిలో రాణించలేదు. ఎక్కువ వికెట్లు కోల్పోయాం. ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులను టాప్ ఫోర్ ఆటగాళ్లు సాధిస్తేనే విజయం సులభమవుతుంది" అని అన్నారు.

"పోయిన సంవత్సరంతో పోలిస్తే టాప్ ఆర్డర్లు తక్కు స్కోరుకే కుప్పకూలారు. మంచి ఆటగాళ్లున్నా, టాప్ ఆర్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది" అని తెలిపారు. ఓపెనర్ మెక్ కల్లమ్ తప్పిస్తే, ఎవరూ 400 పరుగులు మించి చేయలేకపోయారని అన్నారు. ఈరోజు జరగనున్న మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు మొత్తం విజృంభించాలి.

IPL 8: Our top-order needs to get going, says Stephen Fleming

ఇక బౌలింగ్ విషయానికి వస్తే, చక్కగా రాణిస్తున్నారని అన్నారు. బెంగుళూరు జట్టులో తన ఎటాక్‌తో మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించే ఏబీ డివిల్లీర్స్, క్రిస్‌గేల్ గురించి కూడా మా బౌలర్లు ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పారు. ఏబీ డీవిల్లీర్స్ మంచి ఆటగాడు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో అతనొకడని అన్నారు.

డివిల్లీర్స్‌కు బౌలింగ్ చేసేటప్పుడు ఔటయ్యే ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని అన్నారు.
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావిస్తూ వండర్ పుల్ ఆటగాడ
ని సంభోదించారు. ఏది ఏమైనా తన ఎటాకింగ్ బ్యాటింగ్‌తో గేమ్‌ని చెన్నై నుంచి దూరంగా తీసుకపోగల సత్తా మాత్రం ఏబీ డివిలియర్స్‌కే ఉందని చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X