న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకాంత్ ఫైటర్, కానీ ఇంకా మానసికంగా.. : పుల్లెల గోపీచంద్

By Pratap

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సిరీస్ గెలుచుకున్న బి శ్రీకాంత్‌ను చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఫైటర్‌గా అభివర్ణించాడు. భారీ రేంజ్‌లో స్ట్రోక్స్ ఆడే సత్తా శ్రీకాంత్‌కు ఉందని ఆయన అననారు. అయితే, మానసికపరమైన అంశంలో శ్రీకాంత్ ఇంకా మెరుగుపడాల్సి ఉందని గోపీచంద్ అన్నారు.

వచ్చే రోజుల్లో నిలకడ అత్యంత కీలకమైందని ఆయన అన్నారు. కోచ్ దృక్కోణం నుంచి చూసినప్పుడు ఒకరు మ్యాచులు గెలుస్తున్నప్పుడు, అకస్మాత్తుగా మందగిస్తే ఎవరైనా సాధారణ వ్యక్తిలా కనిపిస్తారని ఆయన అన్నారు. ఆ దృక్కోణం నుంచి అది సరైందేనని ఆయన అన్నారు.

 K Srikanth is a fighter, says Pullela Gopichand

శ్రీకాంత్‌కు పోరాటం చేసే పటిమ ఉందని, భారీ రేంజ్‌లో స్ట్రేక్స్ ఆడగలడని, అది ఆటను త్వరంగా మలుపు తిప్పడానికి ఉపయోగపడుతుందని ఆనయ అన్నారు. అయితే, శ్రీకాంత్ మానసికపరమైన, శారీరకమైన కోణంలో శ్రమించాల్సి ఉంటుందని గోపీచంద్ అన్నారు.

హెచ్ఎస్ ప్రణయ్, ఆర్ఎంవి గురుసాయిదత్, అజయ్ జయరామ్ బాగా ఆడే సత్తా ఉన్నవాళ్లని తన ఉద్దేశమని ఆయన అన్నారు. సైనా, శ్రీకాంత్ టైటిల్ గెలుచుకోవడం వల్ల తన కల సాకారమైందని ఆయన అన్నారు. ఇది అద్భుతమని, గత కొద్ది రోజులుగా భారత బ్యాడ్మింటన్ పుంజుకుంటోందని, అది ఎంతో ఆనందించదగిన విషయమని ఆయన అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X