న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియో ఒలింపిక్స్: ఒత్తిడితో.. పోరాడి ఓడిన శ్రీకాంత్

రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్ 2016లో భారత్ పతకాల కోసం ఎదురు చూస్తోంది. ఈ రోజు (బుధవారం) బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చైనా ఆటగాడు లిన్ డాన్ చేతిలో ఓడిపోయాడు.

లిన్ డాన్‌ చేతిలో శ్రీకాంత్‌ 6-21, 21-11, 18-21 తేడాతో ఓటమి చెందాడు. తొలి సెట్‌లో పేలవ ఆటతీరుతో విఫలమైన శ్రీకాంత్‌ రెండో సెట్లో పుంజుకున్నాడు. ఉత్కంఠగా సాగిన మూడో సెట్‌లో పోరాడి ఓడాడు. ఒత్తిడిని జయించలేక పరాజయం పాలయ్యాడు.

సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు: మళ్లీ ప్రశ్నార్థకమైన నర్సింగ్ భవితవ్యంసెమీస్‌కు దూసుకెళ్లిన సింధు: మళ్లీ ప్రశ్నార్థకమైన నర్సింగ్ భవితవ్యం

మూడో సెట్‌ ప్రారంభంలో శ్రీకాంత్ ఆధిక్యం సాధించాడు. కానీ చివరలో వరుస తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. మంగళవారం నాడు వరల్డ్ నెంబర్ 11 శ్రీకాంత్ వరల్డ్ నెంబర్ 5 జార్గన్సన్‌ను ఓడించాడు. కాగా, బ్యాడ్మింటన్‌లో పతకం ఆశలు సెమీస్‌ చేరిన పీవీ సింధుపై ఉన్నాయి.

 Kidambi Srikanth loses quarterfinals to China's Lin Dan in close 3-set contest

సింధుపై ప్రశంసలు

రియో ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరిన భారత షట్లర్‌ పీవీ సింధుపై సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నెం.2 షట్లర్‌ వాంగ్‌ యిహాన్‌ (చైనా)పై సింధు విజయం సాధించింది. తద్వారా సెమీస్‌లో అడుగుపెట్టింది.

ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉన్న సింధు సెమీ ఫైనల్లో తనకంటే మెరుగ్గా ఆరో ర్యాంక్‌లో ఉన్న జపాన్‌ షట్లర్‌ నజోమి ఓకుహరాతో గురువారం పోరుకు సిద్ధమైంది. సింధు ఒక్క మ్యాచ్‌ గెలిస్తే భారత్‌కు పతకం ఖాయమవుతుంది. ఈ పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X