న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'2019 ప్రపంచ కప్‌కు కోహ్లీ కెప్టెన్ కావొచ్చు, బాధ్యత అవసరం'

By Srinivas

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు భావి కెప్టెన్ అని, ఇలాంటప్పుడు అతను జట్టు పైన ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలని స్పిన్ దిగ్గజం ఎర్రబెల్లి ప్రసన్న అన్నారు. వచ్చే ప్రపంచ కప్ నాటికి భారత జట్టు సారథిగా విరాట్ కోహ్లీ ఉండవచ్చునని అన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే అతను మరింత బాధ్యత తీసుకోవాలన్నారు. అంతేకాకుండా, అతను జట్టు ఒకే తాటి పైకి నడిపించే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలన్నారు.

Kohli the leader must play more responsibly: Prasanna

ఆటలో దూకుడును తప్పుపట్టాల్సింది లేదన్నారు. అయితే, సంయమనం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కోహ్లీ మంచి ఆటగాడన్నారు. ప్రత్యర్థి జట్టును గౌరవించాలన్నారు. మనం ఎల్లప్పుడూ బౌలర్ల పైన పై చేయి సాధించకపోవచ్చునన్నారు.

ఆత్మవిశ్వాసంతో ఆడటం చాలా అవసరమని, అయితే ఇతర ఆటగాళ్లను గౌరవించాలన్నారు. అతను ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుమ్యాచుల్లో బాగా ఆడాడన్నారు. ఇటీవల ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో విఫలమైన విషయం తెలిసిందే. లీగ్ నుండి జరిగిన మొత్తం ఎనిమిది మ్యాచులలో కోహ్లీ 305 పరుగులు చేశాడు. యావరేజ్ 50.83గా ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X