న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డు సృష్టించిన పేస్: 700వ విజయం, 100వ భాగస్వామిగా ఫెదరర్..!

By Nageswara Rao

న్యూఢిల్లీ: పారిస్‌లో జరుగుతోన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత్ తరుపున డబుల్స్‌లో డేనియల్ నెస్టర్‌తో కలిసి ఆడుతున్న లియాండర్ పేస్ 700 మ్యాచ్‌లు గెలిచిన అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. టెన్నిస్‌లో డబుల్స్‌లో లియాండర్ పేస్ ఇప్పటి వరకూ 99 సార్లు తన భాగస్వాములను మార్చుకున్నాడు.

లియాండర్ పేస్ ఇప్పటి వరకూ 55 డబుల్స్ టైటిళ్లు గెలుచుకోగా, అందులో 8 గ్రాండ్ స్లామ్ టైటిళ్లున్నాయి. 40 ఏళ్ల వయసులో 2013లో రాడిక్ స్టెపానిక్‌తో జతకట్టిన పేస్, యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి, టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక వయసులో డబుల్స్ టైటిల్ గెల్చుకున్న రికార్డుని కైవసం చేసుకున్నాడు.

భవిష్యత్తులో 100 మంది భాగస్వాములతో ఆడిన, అనుభవాన్ని కూడా లియాండర్ పేస్ సొంతం చేసుకోబోతున్నాడు. ఇందులో భాగంగా ఫ్రెంచ్ ఓపెన్ అనంతరం మరోసారి పేస్ తన భాగస్వామిని మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Leander Paes wins 700th doubles match, enters French Open second round

ఈసారి స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో జతకట్టవచ్చని తెలుస్తోంది. కేరీర్ ఆరంభంలో డబుల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెదరర్, ఆ తర్వాత సింగిల్స్‌కు మాత్రమే పరిమితమయ్యారు. ఇటీవల కాలంలో సింగిల్స్ అంతగా రాణించలేకపోతున్న ఫెదరర్ డబుల్స్‌లో పేస్‌తో జతకట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

వీరిద్దరి భాగస్వామ్యంపై త్వరలో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతోన్న ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X