న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు హోలీ వేడుకలు, మాకు విజయోత్సవాలు: సామీ

By Pratap

పెర్త్‌: ప్రపంచ కప్‌ పోటీల్లో భాగంగా శుక్రవారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో వెస్టిండీస్ భారత్‌పై మాటల యుద్ధాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. ప్రపంచ పోటీల్లో భాగంగా భారత్‌తో హోలీ పండుగ రోజైన శుక్రవారం జరిగే మ్యాచ్‌లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'భారత్‌ హోలీ పండుగ సంబరాలు చేసుకుంటే తాము మాత్రం ఆ మ్యాచ్‌లో విజయోత్సవాలు జరుపుకుంటామ'ని అన్నాడు.

ఈ నెల 6న భారత్‌లో దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరగనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడిన అనుభవమున్న సామికి హోలీ సంబరాలు ఏ స్థాయిలో ఉంటాయనే అంశంపై బాగానే అవగాహన ఉంది. ఈనెల 6న భారత్‌తో జరిగే మ్యాచ్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు మంగళవారం ప్రాక్టీస్‌ చేసింది.

‘Let Team India celebrate Holi, we will rejoice victory’

ఈ సందర్భంగా సామీ భారత మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని చెప్పాడు. ఈ సమయంలో భారత్ బాగా ఆడుతోందని, అర్హత ఉన్న ప్రతి ప్రత్యర్థికీ తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని, భారత్‌తో తాము చాలాసార్లు బాగా ఆడామని, భారత్‌పై తాము విజయం సాధించి తమ పరిస్థితిని మెరుగుపరుచుకుంటామని సామీ అన్నాడు.

హోల్డర్ నాయకత్వంలో ఆడడం తనకు ఆనందంగానే ఉందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. హోల్డర్‌ను బలపరచాల్సిన అవసరం ఉందని, తనను తాను హోల్డర్ కెప్టెన్‌గా నియమించుకోలేదని, తాను కూడా గతంలో హోల్డర్ ఉన్న పరిస్థితిలో ఉన్నానని ఇది ప్రపంచ కప్ అని,త యువ ఆటగాడు జాసన్‌ను బలపరచాల్సిన అవసరం ఉందని అన్నాడు.

వెస్టిండీస్ బౌలింగ్ విషయానికి వస్తే నిలకడ లేకపోవడమనే సమస్య ఉందని అంగీకరించాడు. నిలకడదనం లేకపోవడమే సమస్య అని, తమ ప్రత్యర్థులపై తీవ్రమైన ఒత్తిడి పెట్టామని ఆయన గుర్తు చేశాడు. కాగా ఈ కీలక మ్యాచ్‌కు ముందు విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. గేల్‌ ట్రైనింగ్‌ సెషన్‌కు హాజరైనప్పటికీ ప్రాక్టీస్‌లో మాత్రం పాల్గొనలేదు. అతడు వెన్నెముక గాయంతో బాధపడుతున్నట్టు తెలిసింది. అయితే గేల్‌ ఫిట్‌నెస్‌పై ఆందోళనపైనా సామి స్పందించాడు. 'గేల్‌ వెన్నెముకకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అతడు తప్పకుండా బరిలోకి దిగుతాడ'ని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X