న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదోసారి: వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా, ఒత్తిడితో కివీస్ చిత్తు

By Srinivas

మెల్బోర్న్: ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఆదివారం తలపడగా.. ఆసిస్ ఏడు వికెట్ల తేడాతో కివీస్ పైన గెలిచింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిసారి ఫైనల్‌కు చేరిన కివీస్ ఎలాగైనా ప్రపంచ కప్ గెలవాలనుకుంది. కానీ, రన్నరప్‌గా నిలిచింది.

టాక్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45 ఓవర్లలో 183 పరుగులు చేసింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ 33.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఏడు వికెట్లతో గెలిచింది. మరో 101 బంతులు మిగిలి ఉండగానే ఆసిస్ గెలిచింది. ఇది ఆస్ట్రేలియాకు ఐదో ప్రపంచ కప్.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

న్యూజిలాండ్ పైన ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 33.1 ఓవర్లలో ఆసిస్ ఐదోసారి ప్రపంచ కప్ గెలిచింది. 2015 చాంపియన్‌గా నిలిచింది. 33.1 ఓవర్లో స్మిత్ ఫోర్ కొట్టి ఆసిస్ గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.

ఆస్ట్రేలియా 31.1 ఓవర్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 72 బంతుల్లో 74 పరుగులు చేసిన క్లార్క్.. హెన్రీ బౌలింగులో అవుటయ్యాడు. అతను 10 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

క్లార్క్ 71 బంతుల్లో 74 పరుగులు, స్మిత్ 64 బంతుల్లో 47 పరుగులతో ఉన్నారు.

31వ ఓవర్లో టిమ్ సోథీ బౌలింగులో క్లార్క్ వరుసగా నాలుగు ఫోర్లు కొట్టాడు. ఆసిస్ స్కోర్ 174. రెండు వికెట్లు కోల్పోయింది.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

ఆస్ట్రేలియా 30ఓవర్లలో 157 పరుగులు చేసింది రెండు వికెట్లు కోల్పోయింది.

ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 130 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది.

23 ఓవర్లలో ఆసిస్ స్కోర్ 112/2. స్మిత్ 45 బంతుల్లో 30, క్లార్క్ 42 బంతుల్లో 30 పరుగులతో ఉన్నారు.

ఆసిస్ నిలకడగా ఆడుతోంది. ఇరవై ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

12.2 ఓవర్ల వద్ద దూకుడుగా ఆడుతున్న వార్నర్ అవుటయ్యాడు. అతను 46 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. 12.2 ఓవర్లకు ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.

3 ఓవర్లకు తొమ్మిది పరుగులతో ఉన్న ఆస్ట్రేలియా ఏడో ఓవర్లు పూర్తయ్యేసరికి 41 పరుగులు చేసింది. వార్నర్ దూకుడుగా ఆడుతున్నాడు. 24 బంతుల్లో 28 పరుగులు చేశాడు. స్మిత్ 14 బంతుల్లో 9 పరుగులతో ఉన్నాడు.

ఫించ్ వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆసిస్ తగ్గలేదు. దూకుడుగా ఆడుతోంది.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

ఆసిస్ రెండు పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది.

ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 1.4 ఓవర్లకు ఫించ్ అవుటయ్యాడు. ఫించ్ 5 బంతుల్లో పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు. ఆస్ట్రేలియా బౌల్ట్ బౌలింగులో అవుటయ్యాడు. స్మిత్, వార్నర్ క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా లక్ష్యం 184. స్టార్క్ రెండు వికెట్లు, జాన్సన్ మూడు వికెట్లు, మాక్స్‌వెల్ ఒక వికెట్, ఫాల్కనర్ మూడు వికెట్లు తీశారు.

ఆ తర్వాత బంతికే బౌల్ట్ పదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కివీస్ 45 ఓవర్లలోనే ఆలౌటైంది. 183 పరుగులు చేసింది.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

45వ ఓవర్లో కివీస్ ఆటగాడు హెన్రీ అవుటయ్యాడు. అతను ఏడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే జాన్సన్ బౌలింగులో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ స్కోర్ 44.5 ఓవర్లకు 182 పరుగులు. హెన్రీది తొమ్మిదో వికెట్.

కివీస్ ఆటగాళ్లలో ఒంటరి పోరు చేస్తున్న ఎలియోట్ (82 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 83 పరుగులు) అవుటయ్యాడు. ఫాల్కనర్ బౌలింగులో హాడిన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ తరఫున టేలర్ 40, ఎలియోట్ 83 తప్పు ఎవరు ఆడలేదు. ఎలియోట్ జట్టు స్కోర్ 171 పరుగుల ఉన్నప్పుడు అవుటయ్యాడు. ఇది ఎనిమిదో వికెట్.

కివీస్ 41వ ఓవర్లో చివరి బంతికి ఏడో వికెట్ కోల్పోయింది. జాన్సన్ బౌలింగులో వెట్టోరీ అవుటయ్యాడు. అతను 21 బంతుల్లో 9 పరుగులు చేశాడు.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

151 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగులో క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చి రోంచి అవుటయ్యాడు. అతను నాలుగు బంతుల్లో పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు.

జట్టు స్కోర్ 150 ఉన్నప్పుడు కివీస్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టేలర్ (72 బంతుల్లో 40 పరుగులు) ఫాల్కనర్ బౌలింగులో హాడిన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే అండర్సన్ డకౌట్ అయ్యాడు. ఫాల్కనర్ బౌలింగులో అవుటయ్యాడు. ఇద్దరు కూడా 150 పరుగుల వద్ద నాలుగు, ఐదో వికెట్‌గా అవుటయ్యారు. ఎలియోట్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతను 69 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఓవర్లు 35.3.

కివీస్ 35 ఓవర్లలో 150 పరుగులు చేసింది. టేలర్ 71 బంతుల్లో 40 పరుగులు, ఎలియోట్ 69 బంతుల్లో 72 పరుగులు చేశాడు. మూడు వికెట్లు కోల్పోయింది.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

ఎలియోట్ హాఫ్ సెంచరీ చేశాడు. అతను 51 బంతుల్లో 20 పరుగులు చేశాడు. కివీస్ 28 ఓవర్లకు 115 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.

నెమ్మదిగా ఆడుతున్న ఆస్ట్రేలియా కొంత దూకుడును పెంచింది. టేలర్, ఎలియోట్‌లు ఆచితూచి, దూకుడు పెంచుతున్నారు. 27 ఓవర్లకు కివీస్ 108 పరుగులు చేసింది. ఎలియోట్ 48 బంతుల్లో 47 పరుగులు, టేలర్ 44 బంతుల్లో 26 పరుగులు చేశాడు.

39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ నెమ్మదిగా ఆడుతోంది. ఎలియోట్ (19 బంతుల్లో 15), టేలర్ (30 బంతుల్లో 18 పరుగులు) చేశారు. 20 ఓవర్లకు న్యూజిలాండ్ 66 పరుగులు మాత్రమే చేసింది.

న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 12.2 ఓవర్ల వద్ద విలియమ్సన్ (33 బంతుల్లో 12 పరుగులు) అవుటయ్యాడు. జాన్సన్ బౌలింగులో అతనికే క్యాచ్ ఇచ్చి విలియమ్సన్ పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోర్ 39.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

33 పరుగుల వద్ద గుఫ్తిల్ అవుటయ్యాడు. 11.2 ఓవర్ వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. గుఫ్తిల్ 34 బంతుల్లో 15 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 11.2 ఓవర్లకు 33 పరుగులు. రెండు వికెట్లు. గుఫ్తిల్ మాక్స్‌వెల్ బౌలింగులో అవుటయ్యాడు.

న్యూజిలాండ్ పది ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు వచ్చిన న్యూజిలాండ్ ఒత్తిడితో ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఎనిమిది ఓవర్లకు గుఫ్తిల్ 23 బంతుల్లో 14 పరుగులు, విలియమ్సన్ 21 బంతుల్లో 4 పరుగులతో ఉన్నారు.

ఆరు ఓవర్లకు న్యూజిలాండ్ 23 పరుగులు చేసింది. ఒక వికెట్ (మెకల్లమ్) కోల్పోయింది. గుఫ్తిల్, విలియమ్సన్ నిలకడగా ఆడుతున్నారు.

LIVE: World Cup Final: New Zealand opt to bat first

న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మెకల్ల్ 0.5 ఓవర్లకే అవుటయ్యాడు. అతను మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు.

జట్టు సభ్యులు

న్యూజిలాండ్: మెకల్లమ్ (సారథి), గుఫ్తిల్, విలియమ్సన్, రాస్ టేలర్, ఎలియోట్, కోరే అండర్నన్, ల్యూక్ రోంచి (వికెట్ కీపర్), వెటోరీ, టిమ్ సోథీ, ట్రెంట్ బోల్ట్, మ్యాట్ హెన్రీ

ఆస్ట్రేలియా: మైకేల్ క్లార్క్ (సారథి), డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, బ్రాడ్ హాడిన్ (వికెట్ కీపర్), జేమ్స్ ఫాల్కనర్, మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X