న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ తమిళ తలైవాస్ జెర్సీ ఇదే: అల్లు అర్జున్, రామ్ చరణ్ సందడి

ఆటలపై ఉన్న ఆసక్తితోనే తమిళ తలైవాస్ జట్టు భాగస్వామిగా ఉన్నట్లు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. గురువారం ప్రొ కబడ్డీ లీగ్‌లో తన జట్టు తమిళ తలైవాస్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్ .

By Nageshwara Rao

హైదరాబాద్: ఆటలపై ఉన్న ఆసక్తితోనే తమిళ తలైవాస్ జట్టు భాగస్వామిగా ఉన్నట్లు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. గురువారం ప్రొ కబడ్డీ లీగ్‌లో తన జట్టు తమిళ తలైవాస్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడారు.

దేశంలో కబడ్డీ క్రీడ వేగంగా ఆదరణ పొందుతోందని అన్నారు. తాను అన్ని క్రీడలకు మద్దతు తెలిపేందుకే ఇక్కడికి వచ్చినట్టు సచిన్ గుర్తు చేశారు. తమ జట్టు ఫైనల్ చేరుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆటగాళ్లకు అత్యుత్తమ ప్రదర్శనతో అభిమానులను అలరింప చేయాలని సచిన్ సూచించారు.

ఏదో ఒక సందర్భంలో అందరూ కబడ్డీ ఆడిన వారే

ఏదో ఒక సందర్భంలో అందరూ కబడ్డీ ఆడిన వారే

‘జీవితంలో అందరూ ఏదో సందర్భంలో కబడ్డీ ఆడిన వారే. ఓసారి ఈ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాను. కబడ్డీ ఎనర్జీ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి కబడ్డీపై మరింతగా మక్కువ పెంచుకున్నాను. మా జట్టు.. అభిమానుల మనస్సు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను' అని సచిన్‌ తెలిపారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యువతకు సచిన్ హితవు

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యువతకు సచిన్ హితవు

ఏదో ఒక క్రీడలో పాల్గొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యువతకు సచిన్ సూచించారు. శారీరక వ్యాయమాలు లేకుండా క్రీడలకు దూరంగా ఉంటూ దేశంలో అనారోగ్య జనాభాను పెంచొద్దని హితవు పలికారు. అనారోగ్యాలతో 2020 వరకు జనాభా పరంగా మనదేశం చిన్నదిగా మారిపోవచ్చని, ఎందుకంటే స్థూలకాయంలో మన దేశం మూడోస్థానంలో ఉందని సచిన్ తెలిపారు.

ఢిఫెండర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని

ఢిఫెండర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని

దీని నుంచి బయటపడాలంటే క్రీడా కార్యకలాపాలు పెరగాలని, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆట ఆడాలని సచిన్ సూచించాడు. ఇక కబడ్డీలో డ్రీమ్ జట్టుపై అడగ్గా మాజీ కెప్టెన్ ధోని ఢిఫెండర్, సింగర్ శంకర్ మహాదేవన్ రైడర్ అని సరదాగా వ్యాఖ్యానించాడు. తమిళ తలైవాస్ జట్టు అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించిన కమల్ హాసన్‌కు సచిన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హాజరైన నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌

హాజరైన నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌

ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో జట్టు సహ యజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌లతోపాటు జట్టు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కమల్‌ హాసన్‌ కూడా పాల్గొన్నారు. ఈ సీజన్‌లో తమిళ తలైవాస్‌ జట్టుకు కెప్టెన్‌గా అజయ్‌ ఠాకూర్, కోచ్‌గా కె.భాస్కరన్‌ వ్యవహరించనున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X