న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ వేదికలు: అద్భుతమైన ఏడు

By Nageswara Rao

న్యూఢిల్లీ: 11వ ఐసీసీ వరల్డ్ కప్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న సందర్భంలో గత వరల్డ్ కప్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వన్ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్న విషయం తెలిసిందే.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి ఉన్న క్రేజే వేరు. ఇక వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యా్చ్‌కి ఆతిథ్యం ఇస్తున్న గ్రౌండ్‌ అంటే అందరి కళ్లు ఆ గ్రాండ్ పైనే ఉంటాయి. 10 ఎడిషన్లు జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఏడు గ్రౌండ్లు వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చాయి.

క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానం అత్యధికంగా 4 సార్లు వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 29న జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ రెండో సారి ఆతిథ్యం ఇస్తున్న గ్రౌండ్ జాబితాలోకి చేరింది. ఈ గ్రౌండ్ కెపాసిటీ లక్ష మంది.

ఫిబ్రవరి 14న జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2015ను ఆస్టేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ మొత్తం 49 రోజులు జరగనుంది.

Magnificent Seven: The ICC World Cup finals' venues

వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చిన వేదికలు:


లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ (ఇంగ్లాండ్) - 1975, 1979, 1983, 1999 ఫైనల్స్
విజేత - వెస్టిండిస్ (1975, 79), భారతదేశం (83), ఆస్ట్రేలియా (99)


ఈడెన్ గార్డెన్స్, కోల్ కత్తా (ఇండియా) - 1987
విజేత - ఆస్టేలియా


మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎమ్‌సీజీ), మెల్ బోర్న్ (ఆస్టేలియా) - 1992
విజేత - పాకిస్దాన్


గడాఫీ స్డేడియం, లాహోర్ (పాకిస్ధాన్) - 1996
విజేత - శ్రీలంక


న్యూ వాండరర్స్ స్టేడియం, జోహెన్స్ బర్గ్ (దక్షిణాఫ్రికా) - 2003
విజేత - ఆస్టేలియా


కింగ్టన్ ఓవల్, బ్రిడ్జిటౌన్ (వెస్టిండిస్) - 2007
విజేత - ఆస్టేలియా


వాంఖెడ్ స్టేడియం, ముంబై (భారత్) - 2011
విజేత - భారత్


మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎమ్‌సీజీ), మెల్ బోర్న్ (ఆస్టేలియా) -2015
విజేత - ?

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X