న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షరపోవా ఛాంపియన్, ఫ్యాన్ ఫేవరేట్: రోజెర్స్ కప్‌కు గ్రీన్ సిగ్నల్

రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. ఈ ఏడాది టొరెంటోలో జరిగనున్న రోజెర్స్ కప్‌కు షరపోవాకు వైల్డ్ కార్డు ద్వారా అనుమతి లభించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. ఈ ఏడాది టొరెంటోలో జరిగనున్న రోజెర్స్ కప్‌కు షరపోవాకు వైల్డ్ కార్డు ద్వారా అనుమతి లభించింది. ఈ మేరకు టెన్నిస్ కెనడా అధికారిక ప్రకటన చేసింది.

'మారియా షరపోవా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్, ఫ్యాన్ పేవరేట్' అని రోజెర్స్ కప్ టోర్నమెంట్ డైరెక్టర్ కార్ల్ హాల్ చెప్పారు. షరపోవాపై విధించిన నిషేధిత కాలం పూర్తి అయిన నేపథ్యంలో ఆమె ఆటను చూసేందుకు తమ ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారని అన్నారు.

Maria Sharapova to play Rogers Cup 2017

ఈ వేసవిలో టొరెంటోలో జరగనున్న రోజెర్స్ కప్ టోర్నమెంట్‌కు ఆమెను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. చివరిసారిగా మారియా షరపోవా రోజెర్స్ కప్ ఆడేందుకు 2009లో టోరెంటోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 2014లో ఒకసారి కెనడాకు వచ్చింది.

రోజెర్స్ కప్ టోర్నీ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో మారియా షరపోవా సంతోషం వ్యక్తం చేసింది. రోజెర్స్ కప్ టోర్నీలో ఆడేందుకు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. గతంలో టొరెంటోలో తనకు ఎన్నో మధురానుభూతులున్నాయని షరపోవా ఈ సందర్భంగా చెప్పింది.

ఆ తర్వాత మళ్లీ షరపోవా కెనడాకు రావడం ఇదే తొలిసారి. డోపింగ్ నిషేధం ముగిసిన మారియా షరపోవా ఆడిన స్టట్‌గార్ట్ ఓపెన్ టోర్నీలో సమీ ఫైనల్స్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షరపోవా అంతర్జాతీయ టెన్నిస్ ర్యాంకుల్లో 173వ ర్యాంకులో కొనసాగుతోంది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో షరపోవాకు వైల్డ్‌కార్డ్‌ నిరాకరణ

నిషేధం ముగించుకొని ఇటీవలే పునరాగమనం చేసిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవాకు ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవాకు 'వైల్డ్‌ కార్డు' ఇవ్వడం లేదని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. గాయంతో ఆటకు దూరమై తిరిగొస్తే వైల్డ్‌కార్డ్ పొందొచ్చు.

కానీ, డోపింగ్ నిషేధం కారణంగా తిరిగొస్తే వైల్డ్‌కార్డ్ ఇవ్వలేం అని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ గుడిచెల్లి తెలిపారు. దీంతో గతంలో రెండుసార్లు (2012, 2014లో) ఈ టోర్నీలో విజేతగా నిలిచిన షరపోవా ఈసారి బరిలో దిగే అవకాశాన్ని కోల్పోయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X