ముంబై: బౌలర్‌గా తాను ఎదుర్కొన్న వారిలో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని ఆస్టేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తెలిపారు. వారిద్దరికీ బౌలింగ్ చేయడాన్ని తాను ఎంతగానో ఇష్టపడే వాడినని చెప్పుకొచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల ఆకాంక్షలను మోస్తూ సచిన్ బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేదని పేర్కొన్నారు. సచిన్, లారా లాంటి దిగ్గజ ఆటగాళ్లకు బౌలింగ్ చేయడాన్ని ఇప్పుడు తలచుకుంటే ఎంతో మంచిగా అనిపిస్తుందన్నారు.
సచిన్ టెండూల్కర్‌ను పలు మార్లు పెవిలియన్‌కు పంపినప్పటికీ, అది చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పారు. ఇక ప్రపంచంలో దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో మూడో వ్యక్తి పేరుని చేర్చాల్సి వస్తే కచ్చితంగా రాహుల్ ద్రవిడ్ పేరే చెబుతానని చెప్పారు.
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్లలో రాహుల్ ద్రవిడ్ ఒకడని, అయితే అతనికి రావాల్సినంత గుర్తింపు రాలేదని అభిప్రాయడపడ్డారు. కాగా, అద్భుతమైన వేగంతో బంతులు విసిరే భారత స్పీడ్‌స్టర్ వరుణ్ ఆరోన్‌ను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
వరుణ్ ఆరోన్తో సాధ్యమైనంత ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడించాలని గ్లెన్ మెక్‌గ్రాత్ తెలిపారు. చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా ప్రస్తుతం గ్లెన్ మెక్‌గ్రాత్ ఉన్నారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 124 టెస్టు మ్యాచ్‌లాడిన మెక్‌గ్రాత్ 563 వికెట్లు, 250 వన్డేల్లో 381 వికెట్లు తీసుకున్నారు.