న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ కప్: షమి మెరుపుల వెనక పాక్ మాజీ పేసర్ చిట్కాలు

సిడ్నీ: భారత పేసర్ మహ్మద్ షమి ప్రపంచ కప్ టోర్నీలో అద్భుతంగా రాణించడం వెనక ఓ పాకిస్థాన్ మాజీ పేసర్ చిట్కాలున్నాయి. ఆయనే వసీం అక్రమ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా వసీం అక్రమ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే షమి బౌలింగ్ ప్రతిభను గుర్తించిన అక్రమ్.. అతడ్ని ప్రియ శిశ్యుల జాబితాలో చేర్చుకున్నాడు. అంతేగాక, అతనికి బౌలింగ్ పాఠాలు నేర్పాడు.

ఇది ఇలా ఉండగా, రెండు నెలలకు పైగా సాగిన ఆస్ట్రేలియా పర్యటనలో షమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వికెట్లు తీయడంలో విఫలమవడమే కాక భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఐతే ప్రపంచకప్‌కు వచ్చేసరికి అతడి ప్రదర్శన మారిపోయింది. రెండు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అన్నీ దాదాపుగా కీలక వికెట్లే.

Mohammed Shami soars after flying with Wasim Akram

అతడి ప్రదర్శనలో ఈ మార్పునకు అక్రమ్‌ చెప్పిన చిట్కాలు కూడా కారణమే. ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్‌ ముగించుకుని ప్రయాణంలో ఉండగా ఓసారి షమిని అక్రమ్‌ ఎయిర్‌పోర్ట్‌లో కలిశాడు. ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేశారు.

ఈ సందర్భంగా షమికి అక్రమ్‌ బౌలింగ్‌ చిట్కాలు చెప్పినట్లు తెలిసింది. వేగం తగ్గించడం వల్లే బ్యాట్స్‌మెన్‌ సులభంగా షాట్లు ఆడుతున్నారని.. 140 కి.మీ.కి ఎప్పుడూ తగ్గొద్దని.. ఆ వేగంతోనే బంతిని స్వింగ్‌ చేయడానికి ప్రయత్నించమని అక్రమ్‌.. సమీకి చెప్పాడు. ఆ చిట్కాలు పాటించిన షమి... ప్రపంచకప్‌లో రాణిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా షమి కూడా ప్రకటించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X