న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్

న్యూఢిల్లీ: అక్రమలావాదేవీల కేసులో విచారణకు హాజరుకాకుండా విదేశాలలో కాలం వెల్లదీస్తున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. మనీ లాండరింగ్ కేసులో తప్పించుకున్న లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ కావడంతో కేసు కొత్త మలుపుతిరిగింది.

మనీ లాండరింగ్ కేసులో లలిత్ మోడీ విచారణకు హాజరు కావడం లేదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై కోర్టును ఆశ్రయించింది. లలిత్ మోడీకి నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ చెయ్యాలని మనవి చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న ముంబై పత్రేక న్యాయస్థానం బుధవారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

Mumbai Court issued Non-Bailable Arrest Warrant for Lalit Modi

ఐపీఎల్ చీఫ్ గా ఉన్న సమయంలో లలిత్ మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తరువాత లలిత్ మోడీ ఐపీఎల్ చీఫ్ పదవి నుండి ఉద్వాసనకు గురి అయ్యాడు.

అదే సమయంలో కేసులు నమోదు కావడంతో లలిత్ మోడీ 2010లో లండన్ పారిపోయాడు. విచారణకు హాజరుకాకుండా అధికారులకు చుక్కలు చూపించాడు. అంతే కాకుండ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మీద అనేక ట్విట్ లు చేసి ఆడుకున్నాడు. లలిత్ మోడీ వ్యవహారంతో పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్న సమయంలో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X