న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సైనా, సానియాలపై మోడీ ప్రశంస, ఓడిన టీమిండియాకు బాసట

By Srinivas

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సైనా నెహ్వాల్, సానియా మీర్జాలను ప్రశంసించారు. అదే సమయంలో ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్లో ఓడిన భారత క్రికెట్ జట్టు మద్దతుగా నిలిచారు. ఆదివారం నాటి మన్ కీ బాత్‌లో ప్రధాని క్రీడా అంశాల పైనా స్పందించారు.

మన్‌ కీ బాత్‌ రేడియో ప్రసంగంలో భారత స్టార్లు సైనా, సానియాలను ప్రశంసల్లో ముంచెత్తారు. 'సైనా, సానియా తమ తమ క్రీడల్లో నెం.1 ర్యాంకులతో భారత్‌కు గొప్ప పేరు తీసుకు వచ్చారని కితాబిచ్చారు. వాళ్లతోపాటు భరత మాత పుత్రికలందరికీ తాను అభినందనలు చెబుతున్నానన్నారు.

అయితే ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్లో మన జట్టు ఓడిపోయినప్పుడు కొందరు స్పందించిన తీరు సరిగా లేదని అభిమానులను ఉద్దేశించి అన్నారు. అపజయం ఎదురు కాని ఆట అంటూ ఏదీ ఉండదన్నారు. ఓడినప్పుడు మనం మరింత మద్దతుగా నిలిచి జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలన్నారు.

Narendra Modi lauds Saina Nehwal, Sania Mirza; supports cricket team

కాగా, భూకంపం నేపాల్‌ను తీవ్రంగా నష్టపరిచిందని ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్‌లో ఆదివారం అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గుజరాత్‌లోని కచ్ భూకంపాన్ని గుర్తు చేసుకున్నారు. నేపాల్‌కు భారత్ అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.

నేపాల్ భూకంపం కదిలించిందన్నారు. 2001 జనవరి 26న గుజరాత్‌లోని కచ్‌లో ఇలాంటి భూకంపమే పెను విషాదాన్ని నింపిందన్నారు. నా నేపాల్ సోదర, సోదరీమణులా.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ మీ వెన్నంటే ఉంటుందని అన్నారు. భారత్‌లోని 125 కోట్ల మంది ప్రజలు నేపాల్ కన్నీళ్లు తుడిచేందుకు ముందుకు వస్తారన్నారు. భారతీయులు చేతులు కలిపి మీకు అండగా నిలబడతారన్నారు.

ప్రస్తుతం తమ దృష్టి ఆపదలో ఉన్న వారిని కాపాడటం పైనే అన్నారు. కొద్ది రోజుల క్రితం బీహార్‌లో అకాల వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ భూకంపం మొత్తం ప్రపంచాన్ని కదిలించిందన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X