న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్ష్యం 20 గ్రాండ్‌స్లామ్‌లు: భాగస్వామి కోసం అన్వేషణ

By Nageshwara Rao

హైదరాబాద్: టెన్నిస్‌లో 20 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నానని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. వచ్చే ఏడాది దీనిని సాకారం చేసుకునేందుకు గాను కొత్త భాగస్వామి కోసం అన్వేషణ చేస్తున్నానని పేస్ బుధవారం మీడియాకు తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

43 ఏళ్ల లియాండర్ పేస్ డబుల్స్‌లో 8, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 10 సాధించాడు. భారత టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా కూడా పేరొందాడు. లియాండర్ పేస్ ఇప్పటికే 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్నా.. ఈ ఏడాది అతనికి ఏ మాత్రం కలిసిరాలేదు.

Paes looking for new partner to win two more Grand Slams in 2017

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పేస్ ఏటీపీ సర్కూయట్‌లో ఒక్క టైటిల్‌నూ గెలవలేక పోవడం విశేషం. 1991లో ప్రొఫెషనల్‌గా మారిన లియాండర్ పేస్ ఇప్పటివరకు పురుషుల డబుల్స్‌లో 110 మంది భాగస్వాములతో మిక్స్‌డ్ డబుల్స్‌లో 24 మంది భాగస్వాములతో కలిసి ఆడాడు.

దాదాపుగా 20 ఏళ్ల తర్వాత పేస్‌ ఛాలెంజర్‌ టెన్నిస్‌ బరిలో దిగాడు. పుణే ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత్‌కు చెందిన రామ్‌కుమార్‌తో బరిలోకి దిగిన పేస్ తొలి రౌండ్‌లో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో పేస్ మీడియాతో మాట్లాడాడు.

భారత టోర్నీలకు మద్దతుగా నిలిచేందుకు, కుర్రాళ్లను ప్రోత్సహించేందుకే ఛాలెంజర్‌ టోర్నీలో పోటీ పడుతున్నట్లు పేస్‌ తెలిపాడు. ఈ ఏడాది తనకు అంతగా కలిసిరాకపోయినా, వచ్చే సీజన్‌లో కొత్త భాగస్వామితో కలిసి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నట్లు పేస్ వెల్లడించాడు.

''20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్నాను. వచ్చే ఏడాది కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నాను. మంచి ఆటగాడిని ఎంచుకొని మరిన్ని విజయాలు సాధిస్తానన్న విశ్వాసముంది. ఈ ఏడాది చాలామంది భాగస్వాములు మారారు. ఐతే ఏ ఒక్కరితో జోడీ కుదర్లేదు'' అని చెప్పాడు.

కాగా ఈ సీజన్‌లో ఆండ్రీ బెంజమెన్‌తో జతకట్టి రెండు చాలెంజర్ టైటిళ్లు నెగ్గిన పేస్.. కొత్త సీజన్‌లో అతనితో కలిసి ఆడడం లేదని వెల్లడించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X