న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

16వ టైటిల్: ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్ అద్వానీ

ఐబీఎస్ఎఫ్‌ వరల్డ్‌ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వానీ తన అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ కైవసం చేసుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐబీఎస్ఎఫ్‌ వరల్డ్‌ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వానీ తన అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. (బిలియర్డ్స్, స్నూకర్‌)లో పంకజ్‌కు ఇది 16వ టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీ ఆరంభం నుంచే పంకజ్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తోన్న సంగతి తెలిసిందే.

Pankaj Advani beats Singapore's Peter Gilchrist to win IBSF WorldBilliards Championship

సోమవారం జరిగిన ప్రపంచ బిలియర్డ్స్‌ 150 అప్‌ ఫార్మాట్‌ ఫైనల్లో 31 ఏళ్ల పంకజ్‌ 6-3తో పీటర్‌ గిల్‌క్రిస్ట్‌ (సింగపూర్‌)పై విజయం సాధించాడు. 150-33, 150-95, 124-150, 101-150, 150-50, 150-35, 86-150, 150-104, 150-15 ఫ్రేమ్‌ల తేడాతో పీటర్‌ గిల్‌క్రిస్ట్‌ (సింగపూర్‌)ను ఓడించాడు.

ఇది పంకజ్‌కు 11వ ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్‌. ఆరంభంలో పంకజ్‌కు గట్టిపోటీ ఇచ్చిన గిల్‌క్రిస్ట్‌ ఆ తర్వాత ఎంత మాత్రం ధాటిగా ఆడలేకపోయాడు. వరుస పాయింట్లతో ఆధిపత్యం ప్రదర్శించిన ఆద్వానీ అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

అంతకుముందు జరిగిన సెమీ్‌స్‌లో పంకజ్‌ 5-0తో ఆంగ్‌ హతయ్‌ (మయన్మార్‌) చిత్తుగా ఓడించాడు. గతంలో పంకజ్‌ బిలియర్డ్స్‌ టైమ్‌ ఫార్మాట్‌లో ఏడుసార్లు, పాయింట్స్‌ ఫార్మాట్‌లో మూడుసార్లు, టీమ్‌ ఫార్మాట్‌లో ఒకసారి, స్నూకర్‌లో రెండుసార్లు, సిక్స్‌ రెడ్‌ స్నూకర్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X