న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓడినా బాధపడకపోయేవాడ్ని: శ్రీకాంత్, మెచ్చుకున్న జ్వాలా (పిక్చర్స్)

By Srinivas

హైదరాబాద్: బ్యాడ్మింటన్‌ లెజెండ్ లిన్‌డాన్‌ను ఓడించి చైనా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని భారత టాప్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

ఈ విజయం తనలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని శ్రీకాంత్ చెప్పాడు. తల్లిదండ్రులు, కోచ్‌ గోపీచంద్‌ అందించిన ప్రోత్సాహఫలితమే ఈ విజయమన్నాడు.

ప్రపంచ పదో ర్యాంకర్‌ అయిన శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌ నెగ్గడం ద్వారా తన కెరీర్‌లో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

 శ్రీకాంత్

శ్రీకాంత్

చైనా ఓపెన్‌ నెగ్గి నగరానికి వచ్చిన శ్రీకాంత్‌ను.. క్రీడా పరికరాల తయారీ సంస్థ లీ నింగ్‌ (చైనా) బుధవారం సన్మానించింది. అతనికి రూ. 6.18 లక్షల (పదివేల డాలర్లు) చెక్‌ను అందించింది.

 శ్రీకాంత్

శ్రీకాంత్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోచ్‌ గోపీచంద్‌తో కలసి శ్రీకాంత్‌ మాట్లాడాడు. లిన్‌డాన్‌ను ఓడిస్తానని ఊహించనేలేదన్నాడు. ప్రత్యర్థి ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌ అని తెలిసినా.. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక కసరత్తులు, వ్యూహాలు సిద్ధం చేసుకోలేదని తెలిపాడు.

 శ్రీకాంత్

శ్రీకాంత్

ఫైనల్‌ కోసం మామూలుగానే సిద్ధమయ్యానని, ఆ మ్యాచ్‌ను ఆస్వాదించమని గోపీ సార్‌ చెప్పారని, తాను ఫైనల్‌ చేరడమే గొప్ప విషయమన్నాడు.

 శ్రీకాంత్

శ్రీకాంత్

డాన్‌ చేతిలో ఓడినా పెద్దగా బాధపడేవాడిని కాదని, అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడానని చెప్పాడు. లిన్‌ను ఓడించడం, టైటిల్‌ నెగ్గడం చూస్తే ఇప్పుడదంతా ఒక కలలా అనిపిస్తోందని శ్రీకాంత్‌ చెప్పాడు.

 శ్రీకాంత్

శ్రీకాంత్

చైనా ఓపెన్‌ నెగ్గి నగరానికి వచ్చిన శ్రీకాంత్‌ను.. క్రీడా పరికరాల తయారీ సంస్థ లీ నింగ్‌ (చైనా) బుధవారం సన్మానించింది. ఈ సందర్భంగా అతనిని గుత్తా జ్వాలా అభినందించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X