న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫామ్‌లోకి పీవీ సింధు: ఫ్రెంచ్ ఓపెన్‌పై గురి

By Nageshwara Rao

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆమెకు గట్టి పోటీ ఎదురైంది. తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సింధు 21-9, 29-27తో రుుప్ పుయ్ రుున్ (హాంకాంగ్)పై విజయం సాధించింది.

45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి రెండు గేముల్లో వెనుకబడి ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. తొలి గేమ్‌లో 2-6తో వెనుకంజలో ఉన్న దశలో సింధు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో మరోసారి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌లో ఆధిక్యాన్ని కనబరిచింది.

ఇక, రెండో గేమ్‌లో 7-3తో దూసుకెళ్లిన సింధు త్వరగానే మ్యాచ్‌ ముగించేలా కనిపించింది. అయితే ప్రత్యర్ధి రుుప్ పుయ్ రుున్ అనూహ్యంగా పుంజుకోవడంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. ఒక దశలో 15-13తో సింధును వెనక్కినెట్టిన రుున్ 19-16తో గేమ్‌కు చేరువైంది. ఈ దశలో సింధు పుంజుకుని వరుసగా 3 పాయింట్లు సొంతం చేసుకుని స్కోరును సమం చేసింది.

PV Sindhu returns to action with win at French Open Super Series

ఇక మూడో గేమ్ ఉత్కంఠ భరితంగా సాగింది. 19-19 నుంచి 26-26 వరకు ఇద్దరు చెరో పాయింటు గెలుస్తూ పోయారు. రుుప్ పుయ్ రుున్ మూడుసార్లు గేమ్ పాయింట్లను వదులుకుంది. చివర్లో 26-27 వద్ద వరుసగా మూడు పాయింట్లు సాధించి సింధు మ్యాచ్‌లో విజయాన్ని సొంతం చేసుకుంది.

గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బింగ్‌జియావో (చైనా)తో సింధు తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ 21-16, 21-18తో బున్‌సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)ను ఓడించాడు. దీంతో ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో
తియెన్ చున్ చూ (చైనీస్ తైపీ)తో ప్రణయ్ తలపడనున్నాడు.

మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 22-20, 10-21, 18-21తో జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X