ఘనంగా జడేజా నిశ్చితార్థం: ఇన్‌స్టా గ్రాంలో ఫోటోలు
రాజ్‌కోట్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన స్వస్థలమైన రాజ్‌కోట్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ రీవా సోలంకీతో ఈరోజు నిశ్చితార్థం నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో రవీంద్ర జడేజాకు చెందిన రెస్టారెంట్ ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్'లోనే సన్నిహితుల సమక్షంలో రవీంద్ర జడేజా నిశ్చితార్ధం జరిగింది.
ఘనంగా జడేజా నిశ్చితార్థం: ఇన్‌స్టా గ్రాంలో ఫోటోలు
నిశ్చితార్ధం సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫోటోను రవీంద్ర జడేజా తన ఇన్‌స్టా గ్రాంలో పోస్టు చేశాడు. రవీంద్ర జడేజా నిశ్చితార్థంపై అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. రాజ్‌కోట్‌లో బిజినెస్ మ్యాన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్దేవ్సింగ్ సోలంకీ కూతురే రీవా సోలంకీ.
ఘనంగా జడేజా నిశ్చితార్థం: ఇన్‌స్టా గ్రాంలో ఫోటోలు
25 ఏళ్ల రీవా సోలంకీ రాజ్‌కోట్‌లోని ఆత్మీయ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. గత కొన్ని నెలలుగా యూపీఎస్సీ పోటీ పరీక్షల నిమిత్తం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నారు. గతేడాది స్పిన్నర్ హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా వివాహాలు జరిగిన సంగతి తెలిసిందే.
ఘనంగా జడేజా నిశ్చితార్థం: ఇన్‌స్టా గ్రాంలో ఫోటోలు
ఇటీవలే టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇండోనేషియాలోని బాలిలో బ్రిటిష్ మోడల్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. మరోవైపు ఇదే ఏడాది పేస్ బౌలర్లు మోహిత్ శర్మ నిశ్చితార్థం, వరుణ్ ఆరోన్ వివాహం జరిగాయి.