న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియో ఒలింపిక్స్: 52 ఏళ్ల కల.. చరిత్ర సృష్టించిన దీపా, ఆమె ఓ సంచలనం

రియో డి జెనిరో: మహిళల ఆర్చరీ జట్టు విభాగంలో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌ చేరి పతక ఆశలు కల్పించిన బొంబేలా దేవి, దీపిక కుమారి, లక్ష్మీరాణిలు సెమీ ఫైనల్‌ చేరలేకపోయారు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన వాళ్లు షూటౌట్‌లో రష్యా చేతిలో ఓడిపోయారు.

నాలుగు సెట్లు ముగిసేసరికి రెండు జట్లు 4-4తో సమానంగా నిలవడంతో షూటౌట్‌ అనివార్యమైంది. అయితే షూటౌట్‌లో 23-25తో రష్యా చేతిలో ఓడారు. తొలి సెట్లో 48-55తో ఓడిన భారత ఈ ముగ్గురి జట్టు ఆ తర్వాత 53-52, 53-50తో వరుసగా రెండు సెట్లు గెలిచింది. నాలుగో సెట్‌ను రష్యా 55-54తో నెగ్గింది.

అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌ 5-3తో కొలంబియాను ఓడించింది. మొత్తం నాలుగు సెట్లలో రెండు గెలిచిన భారత బృందం మరొక దాన్ని టైగా ముగించింది. ఇదిలా ఉండగా, దీపిక, బొంబేలా, లక్ష్మీరాణి వ్యక్తిగత విభాగంలో అదృష్టం పరీక్షించుకోనున్నారు.

చరిత్ర సృష్టించిన దీపా

ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్‌ అంచనాలను అందుకుని ఫైనల్‌ చేరుకుంది. కెరీర్‌లో తొలి ఒలింపిక్‌ ఆడుతున్న దీపా మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ క్వాలిఫికేషన్‌లో సత్తా చాటి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో టాప్ 8 జిమ్నాస్ట్స్‌ ఫైనల్‌ చేరుతారు.

ప్రొడునొవాలో ఆరితేరిన దీపా పోటీల్లో భాగంగా జరిగిన వాల్ట్‌ విభాగంలో 14.850 పాయింట్లతో సత్తా చాటింది. తొలి ప్రయత్నంలోనే 15.100తో దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచినా.. రెండో ప్రయత్నంలో 14.600తో అభిమానుల్ని కాస్త కంగారు పెట్టింది. అయితే చివరికి ఎనిమిదో స్థానంలో నిలిచి ఆగస్టు 14న జరగనున్న ఫైనల్‌ల్లో పతక వేటకు సిద్ధమైంది.

ఒలింపిక్స్‌లో ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ విభాగంలో భారత్‌ ఒక అథ్లెట్‌ను కూడా ఇప్పటి దాకా పంపలేకపోయింది. అమెరికా, జపాన్‌ లాంటి దేశాలతో కఠిన పోటీ ఉంటుంది. ఇందుకోసం దీపా రోజుకు ఎనిమిది గంటలకు పైగా దీపా శ్రమించింది. ఇప్పటికే కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా అరుదైన రికార్డు సృష్టించిన దీపా కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలు గెలిస్తే, అందులో 67 గోల్డ్ మెడల్స్.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ క్వాలిఫికేషన్‌లో భారత క్రీడాకారిణి దీప కర్మాకర్‌ మంచి ప్రదర్శన చేసింది. వాల్ట్‌ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఆమె సత్తా చాటుకుంది. తొలి ప్రయత్నంలో 15.100తో అదరగొట్టిన ఆమె, రెండో ప్రయత్నంలో 14.600తో స్కోరును కాస్త తగ్గించుకుంది.

చరిత్ర సృష్టించిన దీపా

చరిత్ర సృష్టించిన దీపా

52 ఏళ్లుగా భారతీయుల కలగా మిగిలిన జిమ్నాస్ట్‌ విభాగంలో ప్రాతినిథ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన దీపా కర్మాకర్‌ అంచనాలను అందుకుని ఫైనల్‌ చేరుకుంది. కెరీర్‌లో తొలి ఒలింపిక్‌ ఆడుతున్న దీపా మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ క్వాలిఫికేషన్‌లో సత్తా చాటి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో టాప్ 8 జిమ్నాస్ట్స్‌ ఫైనల్‌ చేరుతారు.

ఆర్చరీ

ఆర్చరీ

మహిళల ఆర్చరీ జట్టు విభాగంలో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌ చేరి పతక ఆశలు కల్పించిన బొంబేలా దేవి, దీపిక కుమారి, లక్ష్మీరాణిలు సెమీ ఫైనల్‌ చేరలేకపోయారు.

హాకీ

హాకీ

రియోలో తలపడ్డ తొలి మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు పోరాట పటిమ కనబర్చింది. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్‌‌లో పాల్గొంటున్న భారత్‌ పూల్‌-బిలో భాగంగా జపాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించింది. తొలి అర్ధభాగంలో 0-2తో వెనకబడిన భారత్‌ ఆ తర్వాత పుంజుకుంది. పెనాల్టీ కార్నర్‌ అవకాశాలను అందిపుచ్చుకొని రెండు గోల్స్‌ చేసింది.

మన్‌జీత్ సంధు

మన్‌జీత్ సంధు

ఇండియన్ షూటర్లు మన్ జీత్ సింగ్ సంధు, క్యాన్ చినాయ్‌లు వరుసగా 17, 19వ స్థానాల్లో నిలిచి, నిరాశపరిచారు. మూడు రౌండ్లలో మన్ జీత్ 68, చినాయ్ 67 స్కోర్ సాధించారు. మొత్తం 33 మంది షూటర్లు పాల్గొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: Dipa enters Olympic finals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X