న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియో: దూసుకెళ్తున్న సింధు, శ్రీకాంత్, లలిత నిష్క్రమణ

రియో డీ జనీరో: బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్‌ పీవీ సింధు దూసుకెళ్తొంది. అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్‌కు చేరింది. ప్రీ క్వార్టర్స్‌లో సింధు చైనీస్‌ తైపీకి చెందిన థాయ్‌ జూ యింగ్‌పై 21-13, 21-15తో వరుస సెట్లలో విజయం సాధించింది.

మొదటి సెట్‌లో 12-12తో సమానంగా ఉన్న సమయంలో సింధు.. ఒక్క సారిగా పుంజుకొని తొలి సెట్‌ను 21-13తో ముగించింది. అనంతరం రెండో సెట్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించింది.

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌: లలిత నిష్ర్కమణ

భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21-19, 21-19తో తనకన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న జొర్గెన్‌సెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌ది 11వ స్థానంకాగా.. జొర్గెన్‌సెన్‌ది 5వ స్థానం. శ్రీకాంత్‌కు తర్వాతి మ్యాచ్‌ ఇక పెను సవాలే. మంగళవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో అతడు రెండుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ లిన్‌ డాన్‌తో తలపడతాడు. శ్రీకాంత్‌కు ముందు ఒలింపిక్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో భారత్‌ తరఫున ఒక్క కశ్యప్‌ మాత్రమే క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

Rio Olympics 2016: PV Sindhu enters women's singles quarters

లలిత బాబర్‌కు పదో స్థానం

ట్రాక్‌ ఈవెంట్లో ఒలింపిక్స్‌లో గత 32 ఏళ్లలో ఫైనల్‌ చేరిన భారత తొలి మహిళగా ఘనన సాధించిన లలిత బాబర్‌ తుది పోరులో నిరాశ పరిచింది. ఆమె పదో స్థానం (9:22.74)తో సరిపెట్టుకుంది. రెజ్లింగ్‌ పురుషుల గ్రీకో రోమన్‌ (85 కేజీ)లో రవిందర్‌ ఖత్రి తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు.

పరుషుల ట్రిపుల్‌ జంప్‌లో రంజిత్‌ మహేశ్వరి క్వాలిఫయింగ్‌ దశలోనే నిష్క్రమించాడు. అర్హత రౌండ్లో అతడు 16.13మీ దూకి 15వ స్థానంతో సంతృప్తి చెందాడు. మహిళల 200మీ పరుగులో శ్రాబణి నంద హీట్స్‌ దశలోనే నిష్క్రమించింది.

నిరాశపరిచిన వికాస్‌ కృష్ణన్‌

పతకంపై ఆశలు రేపిన భారత బాక్సర్‌ వికాస్‌ కృష్ణన్‌ నిరాశపరిచాడు. బాక్సింగ్‌ 75కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌లో పరాజయం పాలయ్యాడు. ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ బెక్టెమిర్‌పై ఏ దశలోనూ పోరాటం ప్రదర్శించకుండా 0-3 తేడాతో వికాస్‌ ఓడిపోయాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: PV Sindhu enters quarters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X