న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియో ఒలింపిక్స్: హాకీ స్క్వాడ్, 36 ఏళ్ల తర్వాత మహిళా టీం, రీతూ ఔట్

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ 2016 కోసం భారత పురుషుల, మహిళల హాకీ టీంలను ప్రకటించారు. కెప్టెన్ రీతూ రాణీని మాత్రం తీసుకోలేదు. గోల్ కీపర్ ఆర్పీ శ్రీజేష్ పురుషుల టీంను లీడ్ చేయనన్నాడు. మహిళల టీంకు సుశీలా చాను కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

భారత పురుషుల ఒలింపిక్స్ జట్టు ఎనిమిదిసార్లు బంగారు పతకాలు సాధించింది. కానీ 1984 నుంచి హాకీ టీం పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగా లేదు. 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో భారత్ 12వ స్థానానికి పరిమితమైంది.

వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్‌లో భారత్ గ్రూప్ బీలో ఉంది. ఇందులో అర్జెంటీనా, కెనడా, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్ ఉన్నాయి.

Rio Olympics: Indian hockey teams announced; Ritu Rani dropped

భారత మహిళల జట్టు కూడా పూల్ బీలో ఉంది. ఇదే పూల్‌లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి.

కాగా, రీతూ రాణీని ఎంపిక చేయలేదని అధికారులు చెప్పారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయన్నారు. ఒకటి పర్ఫార్మెన్స్ బాగా లేదని, మరొకటి రీతూ ప్రవర్తన కూడా బాగా లేదని చెప్పారు.

మహిళల టీం 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లా పాల్గొనబోతుంది. గత ఏడాది భారత మహిళల టీం క్వాలిఫై అయింది. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల హాకీ టీం చివరిసారి పాల్గొన్నది. అప్పుడు మహిళల టీం 4వ స్థానంలో నిలిచింది. మళ్లీ ఇప్పటి దాకా ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు.

పురుషుల స్క్వాడ్

గోల్ కీపర్ - ఆర్పీ శ్రీజేష్ (కెప్టెన్)
ఫార్వార్డ్స్ - హర్మాన్ ప్రీత్ సింగ్, ఎస్వీ సునీల్ (వైస్ కెప్టెన్), ఆకాష్ దీప్ సింగ్, రమణ్ దీప్ సింగ్, నిఖ్కీ తిమ్మయ్య
మిడ్ ఫీల్డర్స్ - సర్దార్ సింగ్, మన్ ప్రీత్ సింగ్, ఎస్కే ఉతప్ప, దేవేందర్ వాల్మికీ, చింగలేన్సన సింగ్, దనిష్ ముజ్తాబా
డిఫెండర్స్ - రుపేందర్ పాల్ సింగ్, కొథాజిత్ సింగ్, సురేందర్ కుమార్, వీఆర్ రఘునాథ్.
స్టాండ్ బై - పర్దీప్ మోర్, వికాస్ దహియా

మహిళల స్క్వాడ్

గోల్ కీపర్- సవిత
ఫార్వార్డ్స్ - అనురాధా దేవి తోచం, పూనమ్ రాణి, వందన కటారియా, ప్రీతి దుబే, రాణీ రాంపాల్
మిడ్ ఫీల్డర్స్ - నవజోత్ కౌర్, మోనికా, రేణుకా యాదవ్, లిలిమా మింజ్, నిక్కి ప్రదాన్
డిఫెండర్స్ - సుశీలా చాను (కెప్టెన్), దీప్ గ్రేస్ ఎక్కా, దీపికా (వైస్ కెప్టెన్), నమిత్ తోప్పొ, సునీతా లక్రా
స్టాండ్ బై - రజనీ ఏటిమార్పు, హెచ్ లాల్ రౌత్ ఫెలి

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X