న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్-జడేజా వరల్డ్ కప్ రికార్డుని అధిగమించిన రోహిత్-ధావన్

By Nageswara Rao

హామిల్టన్: ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ బిలో భాగంగా ఐర్లాండ్ Vs భారత్ మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజా వరల్డ్ కప్ రికార్డుని రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు అధిగమించారు.

ఈ మ్యాచ్‌లో 260 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు తొలి వికెట్‌కి 174 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ భాగస్వామ్యం భారత్‌కు వరల్డ్ కప్‌లో ఒక రికార్డుని సృష్టించింది.

Rohit-Shikhar pair breaks Sachin-Jadeja's World Cup record

1996లో కెన్యాపై జరిగిన వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజాలు 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ రికార్డుని ఎవరూ అధిగమించలేదు. కెన్యాపై జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సెంచరీ సాధించగా, అజయ్ జడేజా 53 పరుగులు సాధించాడు.

ఇక రోహిత్ శర్మ 64 పరుగులు సాధించి, తన కెరీర్‌లో వన్డేల్లో 4000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. 4000 పరుగులు దాటిన భారత 14వ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ. కెరీర్‌లో ఇది 25వ అర్ధ సెంచరీ. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 84 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ వరల్డ్ కప్‌లో ధావన్‌కు ఇది రెండో సెంచరీ. రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు నెలకొల్పిన 174 పరుగుల భాగస్వామ్యం ఈ వరల్డ్ కప్‌లోనే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X