న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తెలుగు భాషలో కూడా సచిన్ పుస్తకం, దేవుడ్ని కాదని..

By Srinivas

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 'ప్లేయింగ్ ఇట్ మై వే' సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పుస్తకం భారత దేశంలోని ప్రాంతీయ భాషల్లోకి కూడా రానుంది. తెలుగులోకి కూడా అనువదించనున్నారు. తెలుగుతో పాటు మరాఠీ, హిందీ, గుజరాతీ, మలయాళం, అస్సామీ, బెంగాలీ బాషల్లో ఈ ఆత్మకత పుస్తకం రానుంది.

ప్రాంతీయ భాషల్లోకి దీనిని అనువదించాలని పుస్తక ప్రచురణకర్తలు నిర్ణయం తీసుకున్నారు. పలువురి నుంచి వచ్చిన విజ్ఞాపనల మేరకే పలు భాషల్లో ప్రచురించాలనుకుంటున్నామని సచిన్ పుస్తక సహ ప్రచురణకర్త అయిన 'హెచ్చీట్ ఇండియా' తెలిపింది. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల పబ్లిషర్స్‌తో మాట్లాడుతున్నట్టు హెచ్చీట్ ఇండియా వర్గాలు తెలిపాయి.

ఆయా భాషల్లో సరైన సహ ప్రచురణకర్తల కోసం చూస్తున్నామని హెచ్చీట్ ఇండియాకు చెందిన పౌలొమి ఛటర్జీ తెలిపారు. వచ్చే ఏడాది వేసవిలో ఆ పుస్తకాలను విడుదల చేస్తామని చెప్పారు. కొద్ది వారాల్లో ఆయా భాషల్లోని తమ పబ్లిషింగ్ పార్ట్‌నర్స్‌ను ఫైనలైజ్ చేస్తామని చెప్పారు.

Sachin's book to be published in regional languages

కాగా, సచిన్ టెండుల్కర్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకం నవంబర్ మొదటి వారంలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే అమ్మకాల్లో ఇది రికార్డు సృష్టించింది. రెండు లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరును లిఖించుకున్న సచిన్ .. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత దీని ద్వారా రికార్డులను సృష్టిస్తున్నారు.

పలు నివేదికల ప్రకారం సచిన్ పుస్తకానికి బుధవారం(నవంబర్ 6) నాటికే భారతదేశంలో 1,50,000 కాపీలకు ముందుగానే ఆర్డర్లు వచ్చాయి. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా 1,10,000 కాపీలను ముద్రించారు. ఈ పుస్తకం హెచ్చీట్ ఇండియా ద్వారా ప్రచురితం చేయడం జరిగింది.

ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ రికార్డు స్థాయిలో 1,30,000 కాపీల అమ్మకాలను సాధించింది. సచిన్ పుస్తకం(కాల్పనికేతర హార్డ్‌బాక్) 1,50,000 కాపీల అమ్మకాలతో ఆ రికార్డును బద్దలు కొట్టింది.

హెచ్చీట్ ఇండియా ఎండి థామస్ అబ్రహాం తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 6నాటికి 1,50,000ల కాపీలకు ముందస్తు ఆర్డర్లు వచ్చాయి. దీనికంటే ముందు వాల్తేర్ ఈసక్సన్ ద్వారా ప్రచురితమైన స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ ఈ కేటగిరిలో బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురితం చేసిన కథనం ప్రకారం ఇవి భారతదేశంలో అత్యధికంగా 1,30,000 కాపీలు అమ్ముడయ్యాయి.

దేవుడిని కాదన్న సచిన్

సచిన్ టెండుల్కర్‌ను అభిమానులు క్రికెట్ దేవుడు అంటారు. అయితే, తాను దేవుడిని కానని సచిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సామాన్య వ్యక్తిని అని చెప్పాడు. తాను సాధారణమైన వ్యక్తినని, మైదానంలో ఎన్నో తప్పులు చేశానన్నాడు. ప్రజలు తనపై ఇంతలా అభిమానం చూపడాన్ని అదృష్టంగా భావిస్తానని, దేవుడు తనపై కరుణ చూపాడన్నాడు. రిటైర్మెంట్ తర్వాత బిజీ అయ్యానని, జీవితంలోని మరో పార్శ్వం గురించి తెలుసుకుంటున్నానన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X