న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ చిన్ననాటి జ్ఞాపకాలు: కాంబ్లీతో దిగిన ఫొటో

ముంబై: తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. తన బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీతో దిగిన ఓ ఫొటోను ఇటీవల సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. 1988లో సచిన్, వినోద్ కాంబ్లీ సంయుక్తంగా పాఠశాల క్రికెట్లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే.

గత కొంత కాలంగా వినోద్ కాంబ్లీతో సన్నిహితంగా ఉండని సచిన్ టెండూల్కర్.. తన చిన్ననాటి స్నేహితుడ్ని ఇంకా మర్చిపోలేదని ఈ ఫొటోతో గుర్తు చేసినట్లయింది. ఎంతైనా చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతనితో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

పాఠశాలలో చదువుతున్న సమయంలో సచిన్-కాంబ్లీ ద్వయం 1988లో హారిస్ షీల్డ్ మ్యాచ్‌లో 664 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత జాతీయ జట్టులో ఇద్దరూ కలిసి ఆడినా.. కాంబ్లీ కెరీర్ (1991-2000) 17 టెస్టులు, 104 వన్డేలకే పరిమితమైంది.

Sachin Tendulkar Revives Memories, Posts Photo with Vinod Kambli

1993లో ఇంగ్లాండ్, జింబాబ్వేలతో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలో సాధించి మంచి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే వివాదాలతో సన్నిహితంగా ఉండే కాంబ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ జీవితానికి పరిమిత కాలంలోనే ముగింపు పలకాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు.

రాత్రికిరాత్రే వచ్చిపడిన సక్సెస్‌తో కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్న కాంబ్లీ.. తనకు కష్టకాలంలో సచిన్ సహాయం చేయాల్సిన స్థితిలో ఉండికూడా ఆదుకోలేకపోయాడని అప్పట్లో బహిరంగంగానే విమర్శ చేశాడు.

ఈ పరిణామంతో కలతచెందిన సచిన్ అతణ్ని దూరం పెట్టడం ప్రారంభించాడు. చివరికి 2013, నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలో చేసిన ఉపన్యాసంలో కూడా చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసుకున్న సచిన్.. ఎక్కడా కాంబ్లీ పేరును ప్రస్తావించలేదు. కాగా, ఆ తర్వాత సచిన్ తనను గుర్తుచేసుకోకపోవడం బాధించిందని కాంబ్లీ మీడియా ఎదుటే ఆవేదనగా తెలిపాడు.

ది డెయిలీ గ్రాఫ్‌కు ఓ ఇంటర్వ్యూలో ప్రతిభ గురించి తాను ఏమీ చెప్పలేనని కాంబ్లీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. కాంబ్లీ జీవన శైలి తనతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుందని తెలిపాడు. వేర్వేరు సందర్భాల్లో తమ ఇద్దరి ప్రవర్తన, స్పందన వేరుగా ఉంటుందని చెప్పాడు. తనపై తన కుటుంబం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుందని, అందుకే తానిలా ఉన్నానని సచిన్ తెలిపాడు.

ఏదేమైనా ఈ క్రికెట్ స్నేహితులు మళ్లీ ఈ ఫొటోతోనైనా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి దగ్గరవుతారేమో వేచి చూడాలి.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X