న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనా నెహ్వాల్‌కు కేంద్రం రూ. 9 లక్షల నగదు సాయం

By Nageswara Rao

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కేంద్ర క్రీడల శాఖ రూ. 9 లక్షల నగదు సాయాన్ని అందించింది. 2016 రియో ఒలంపిక్స్‌ సన్నాహకాల్లో భాగంగా సైనా నెహ్వాల్ పూర్తి స్ధాయి ఫిజియోథెరిపిస్ట్ కోసం నియమించుకోవాలని కేంద్రాన్ని కోరింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ నెల నుంచి 15 నెలలు కాలానికి ఫిజియోథెరిపిస్ట్‌కు నెలకు రూ. 60 వేల చొప్పున ఈ నగదుని కేటాయించారు. కాగా, ఫిజియోథెరిపిస్ట్‌గా ఎవరిని నియమించుకోవాలనే విషయాన్ని సైనా నెహ్వాల్‌కే వదిలిపెట్టింది.

 Saina Nehwal to get 9 lakh for hiring physiotherapist

ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సైనా నెహ్వాల్ లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. టార్గెట్ ఒలంపిక్ పోడియం (టీఓపీ) పథకం కింద నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 2016 ఒలింపిక్స్ కోసం ఈ ఆర్ధిక సహాయం పొందింది.

సైనా నెహ్వాల్ ప్రస్తుతం బెంగుళూరులోని ప్రకాస్ పదుకొణె బ్యాట్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X