న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తప్పు ఎక్కడ జరిగింది?: సానియా మీర్జాపై నెటిజన్ల మండిపాటు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు చురకలంటించారు. వ‌న్ ప్ల‌స్ 3టీ స్మార్ట్‌ఫోన్ ప్ర‌మోష‌న్ కోసం సానియా చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు చురకలంటించారు. వ‌న్ ప్ల‌స్ 3టీ స్మార్ట్‌ఫోన్ ప్ర‌మోష‌న్ కోసం సానియా చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. సెలబ్రెటీలు సోషల్‌మీడియా వేదికగా డబ్బులు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే.

టీమిండియా మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ తన ట్వీట్ల ద్వారా సుమారు రూ.10 లక్షలు సంపాదించినట్లు అప్పట్లో వెల్లడించాడు. తమకున్న క్రేజ్‌ని అనుకూలంగా మలచుకుని పలువురు సెలబ్రెటీలు సోషల్‌మీడియా ద్వారా ప్రమోషన్లు చేపడుతున్నారు. తాజాగా సానియా మిర్జా చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు సీరియ‌స్ అయ్యారు.

Sania Mirza promotes One Plus 3T phone, using an iPhone; gets trolled on Twitter

అసలేం జరిగిందంటే.. తాజాగా సానియా వన్‌ప్లస్‌ 3టీ మొబైల్‌ను ప్రచారం చేసేందుకు తన ట్విటర్‌ ఖాతాను వినియోగించుకుంది. కొన్ని నెలలుగా ఈ ఫోన్‌ వాడుతున్నాని, ఎంతో సౌకర్యవంతంగా ఉందని ట్వీట్‌లో ఆమె పేర్కొంది. అయితే ఆ ట్వీట్‌ను సానియా త‌న‌ ఐఫోన్ నుంచి పోస్ట్ చేసింది.

సాధారణంగా ఐఫోన్‌ నుంచి ఏ ట్వీట్‌ చేసిన మనకు తెలిసిపోతోంది. ఐఫోన్ యాప్ నుంచి చేసే ప్ర‌తి ట్వీట్‌కు వ‌యా ట్విట్ట‌ర్ ఫ‌ర్ ఐఫోన్ అని ట్యాగ్ వ‌స్తుంది. దీనిని గమనించిన నెటిజన్లు ఐఫోన్‌ వాడుతూ మరో ఫోన్‌కి ప్రచారం కల్పిస్తున్నావా? అంటూ సానియా మిర్జాపై విమర్శలు గుప్పించారు.

Sania Mirza promotes One Plus 3T phone, using an iPhone; gets trolled on Twitter

మార్కెటింగ్‌ కోసం ఇలా చేయడం చాలా సిగ్గుచేటు అని మరికొందరు ఆమెకు చురకలంటించారు. దీనిని గమనించిన సానియా మిర్జా వెంటనే ఆ ట్వీట్‌ను తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X