న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెరపై సానియా మీర్జా జీవితం, దర్శకురాలు ఫ్రెండే

By Srinivas

ముంబై: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ తెరకెక్కిస్తున్నారి తెలుస్తోంది.

సానియా మీర్జా, ఫరాఖాన్ మంచి స్నేహితులు. సానియా ఆత్మకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.

సానియా మీర్జా పాత్రలో పరిణీతి చోప్రా నటించే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు సానియా మీర్జా ఆత్మహత్మ ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.

Sania Mirza's biopic on silver screen?

కాగా, మేరీ తన జీవిత కథను సినిమాగా తీయడం ఇష్టం లేదని టెన్నస్ స్టార్ సానియా మీర్జా దాదాపు ఏడాది క్రితం చెప్పారు. ఒకవేళ సినిమాగా తీస్తే తెరపై తన పాత్రను దీపికా పదుకొణే పోషిస్తే బాగుంటుందని చెప్పారు.

ఇటీవల తనను ఓ దర్శకుడు కలిశారని, తన జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించాలని ఉందని తనతో దర్శకుడు చెప్పారని అయితే తాను తిరస్కరించినట్టు సానియా ఆ రోజు చెప్పారు.

తన జీవితంలోని సంఘటనల్ని బహిరంగం చేయకూడదనే ఉద్దేశ్యంతోనే ఇటీవల ఓ సినీ దర్శకుడి విజ్ఞప్తిని తిరస్కరించినట్టు తెలుస్తోంది. తన జీవిత కథ సినిమాగా రూపొందడం ఇష్టం లేదని, తాను కలివిడి మనిషి కాను. తన జీవితంలోని ముఖ్య సంఘటనలు ప్రజలతో పంచుకోవడం ఇష్టం లేదని చెప్పారు. అయితే, ఇప్పుడు సానియా సినిమా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X