న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14-9-9-9: క్రికెట్లో సర్ఫరాజ్ తమ్ముడి అద్భుతం, యువీనీ ఔట్ చేశాడు

By Srinivas

ముంబై: ఐపీఎల్ 8లో సర్ఫరాజ్ ఖాన్ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు అతని తమ్ముడు తొమ్మిదేళ్ల ముషీర్ ఖాన్ సత్తా చాటాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నిర్వహించిన ఓ మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. తొమ్మిదేళ్ల ముషీర్ ఖాన్ ఓ ఇన్నింగ్స్‌లో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి తొమ్మిది వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

దాదర్ యూనియన్ జట్టు తరఫున ముషీర్ ఆడుతున్నాడు. ఆ సమయంలో ఈ ఫీట్ సాధించాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. విరార్ జట్టుతో రెండు రోజుల మ్యాచ్‌లో ఇతను దాదర్ యూనియన్ తరఫున ఆడాడు. ఇతను లెఫ్టార్మ్ స్పిన్నర్.

Sarfaraz Khan'

ఇన్నింగ్సులో అతను 14 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 9 ఓవర్లు మెయిడిన్లు కావడం గమనార్హం. అతని గణాంకాలు 14-9-9-9గా ఉంది. ముషీర్ ధాటికి విరాట్ జట్టు విలవిలలాడింది. ఇతను బ్యాటింగ్‌లోను రాణించాడు.

ఇతను 152 బంతుల్లో 48 పరుగులు చేసి తన జట్టు సెమీస్ చేరడంలో కీలకపాత్ర వహించాడు. ముషీర్ ఖాన్ గతంలోను సంచలనాలు సృష్టించాడు. 2013 ఆగస్టులో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ను అవుట్ చేయడం గమనార్హం.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X