న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరితా దేవి వివాదం: భర్త, కోచ్‌లకు షోకాజ్ జారీ

By Pratap

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని స్వీకరించడానికి నిరాకరించిన సరితా దేవి వివాదం కొత్త మలుపు తిరిగింది. అనధికారికంగా రింగ్ సైడ్ ఉండడంపై బాక్సింగ్ ఇండియా సరితా దేవి కోచ్‌కు, భర్తకు షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఓ ప్రముఖ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా ధ్రువీకరించారు.

కాగా, బాక్సింగ్ ఇండియా నిర్ణయంపై ఇప్పుడే స్పందించదడానికి సరితా దేవి భర్త సి. తోయిబా సింగ్ నిరాకరించారు. షోకాజ్ నోటీసు తనకు ఇంకా అందాల్సి ఉందని, దానని తీసుకున్న తాను ఏమైనా చెప్పగలనని ఆయన అన్నారు. తాను ప్రేక్షకుడిగా అక్కడికి వెళ్లానని, తన భార్య కోసమే కాకుండా బాక్సర్లందరినీ వీక్షించడానికి తాను వెళ్లానని ఓ చానెల్‌తో ఆయన అన్నారు.

Sarita Devi controversy: Boxing India to issue showcause notice to coach, husband

సరితా దేవికి భారత క్రికెట్ దిగ్దజం సచిన్ టెండూల్కర్ బాసటగా నిలిచాడు. సరితా దేవికి మద్దతు ఇవ్వాలని, ఆమె కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోకుండా చూడాలని కోరుతూ ఆయన నవంబర్ 15వ తేదీన క్రీడా మంత్రికి లేఖ రాశారు.

కాగా, తమ దేశం బాక్సర్ ఎల్ సరితా దేవిపై విధించిన ప్రొవిజనల్ సస్పెన్ ఎత్తేయాలని బాక్సింగ్ ఇండియా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి ఇటీవల విజ్ఞప్తి చేసింది. సరితా దేవి బేషరతుగా క్షమాపణ చెప్పిందని, కఠిన క్రమశిక్షణకు గతంలో కట్టుబడిన చరిత్ర ఆమెకు ఉందని చెబుతూ వాటిని దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్ ఎత్తేయాలని కోరినట్లు బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా చెప్పారు.

ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో వివాదాస్పదమైన సెమీ ఫైనల్ ఓటమికి తీవ్ర మనస్తాపానికి గురైన సరితా దేవి కాంస్య పతకాన్ని స్వీకరించడానికి నిరాకరించింది. సరితా దేవి పతకాలను ప్రదానం చేసే సమయంలో ఉద్వేగానికి గురై ఏడ్చింది. ఆమె భర్త తోయిబా కేకలు వేస్తూ కనిపించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X