న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సహనాన్ని పరీక్షిస్తున్నావ్: కిర్గియోస్‌కి షేన్ ‘వార్నింగ్’

మెల్‌బోర్న్/న్యూయార్క్: టెన్నిస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ తన నోటి దురుసుతో ఆస్ట్రేలియా పరువుతీస్తున్నాడనే భావన ఆస్ట్రేలియాకే చెందిన మాజీ క్రికెటర్ వార్న్‌కూ వచ్చినట్టుంది. అందుకే, అతనికి సుద్దులు చెప్పాడు.

ఈ క్రమంలోనే 'నువ్వు మా సహనాన్ని పరీక్షిస్తున్నావ్ కిర్గియోస్. ఆట ద్వారానే నిన్ను నీవు నిరూపించుకో' అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు వార్న్.

అంతేగాక, 'నీ ప్రతిభను వృథా చేసుకోకు. ప్రపంచ వ్యాప్తంగా అంతా నిన్ను ఇష్టపడతారు.. ప్రత్యేకించి ఆస్ట్రేలియన్లు. ఓడిపోయినందుకు సిగ్గుపడాల్సిన పనిలేదు. అయితే, చివరికంటా పోరాడగలగాలి' అంటూ హితవు చెప్పాడు.

ఇక నుంచి నోరు మూసుకొని ఆడతా: కిర్గియోస్

Shane Warne's warning for 'young' Nick Kyrgios

న్యూయార్క్: జరిమానా రూపంలో వాత.. పరువుకి పరువూ పోయాకగానీ ఆస్ట్రేలియా యువ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్‌కి బుద్ధివచ్చినట్లుంది. ఇక నుంచి కోర్టులో తానిక నోరు మెదపనని చెప్పుకొస్తున్నాడు.

మొన్నీమధ్య మాంట్రియల్ టోర్నీలో ప్రత్యర్థి స్విస్‌స్టార్ వారింకాను ఉద్దేశించి అతని గర్ల్‌ఫ్రెండ్ విషయంలో రాయలేని భాషలో బూతులు ప్రయోగించిన కిర్గియోస్.. అందుకు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు.

ఆ సంఘటన గురించి మీరు ఏం పాఠం నేర్చుకున్నారు? అనడిగితే.. 'కొన్ని సందర్భాల్లో నోరు మూసుకొని ఆడాలి' అని చెప్పేశాడు. కాగా, తనకు టెన్నిస్‌లో అండీ ముర్రే ఆదర్శమని తెలిపాడు. ఆట పరంగా ఏ సమస్యొచ్చినా, అతని వద్దకెళ్లి పరిష్కరించుకుంటానన్నాడు. ఇది ఇలా ఉండగా, కిర్గియోస్.. యూఎస్ ఓపెన్ తొలిరౌండ్లో ముర్రే చేతిలోనే ఓడాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X