న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బోర్డుపై అలక, బౌలింగ్ యాక్షన్‌పై భయం: ప్రపంచ్ కప్‌కు సానియా భర్త దూరం

By Pratap

కరాచీ: తన బౌలింగ్ యాక్షన్‌ను, జట్టులో నెలకొన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ప్రపంచ కప్ పోటీలకు దూరంగా ఉండాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త నిర్ణయించుకున్నారు పిటిఐ వార్తా సంస్థ ఇందుకు సంబంధించి ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. బోర్డు తన పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి షోయబ్ మాలిక్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడానికి మొదటి కారణం కాగా, తన బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు రెండో కారణమని ఆయన సన్నిహితులు చెప్పారు.

బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ నుంచి సయీద్ అజ్మల్, ముహమ్మద్ హఫీజ్ సస్పెన్షన్‌కు గురైన తర్వాత షోయబ్ మాలికి జాతీయ జట్టులోకి వస్తారని వార్తలు వచ్చాయి. మాలిక్ ఆప్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. అన్ని దేశీవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లోనూ బౌలింగ్ చేశారు. ఈ సీజన్‌లో అతను 18 వికెట్లు తీసుకున్నాడు. అయితే, అతను ప్రాథమికంగా బ్యాట్స్‌మన్.

 Shoaib Malik fears 'chucking' calls, reluctant to play World Cup: Reports

ప్రపంచ కప్ ప్రారంభమయ్యే లోగా ఐసిసి నుంచి సయిదా, హఫీజ్‌లకు క్లియరెన్స్ లభించే అవకాశం లేకపోవడంతో మాలిక్‌ను ఆల్ రౌండర్‌గా పరిగణనలోకి తీసుకుని జాతీయ జట్టులోకి తీసుకుంటారని చెబుతున్నారు. ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రాథమిక జట్టులో మాలిక్ పేరు ఉంది.

ఐసిసి కొత్త ప్రోటోకాల్ బౌలర్లకు, ఆఫ్ స్పిన్నర్లకు కఠినంగా ఉందని, మాలిక్ దాని నుంచి సమస్యను ఎదుర్కోవచ్చునని, అయితే ఆల్ రౌండర్ సామర్థ్యం కారణంగా మాలిక్‌ను జట్టులోకి తీసుకునే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా అన్నారు. మొదట సెలెక్టర్లు మాలిక్‌తో మాట్లాడి జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాడా, లేదా కనుక్కోవాలని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. మాలిక్ అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడానికి ఇష్టపడుతాడా, లేదా అనేది తెలియదని ఆయన అన్నారు.

ప్రపంచ కప్ పోటీలు ముగిసిన తర్వాత జాతీయ జట్టులోకి వచ్చే విషయాన్ని ఆలోచిస్తానని షోయబ్ మాలిక్ చెప్పినట్లు సమాచారం. మిస్బా, హఫీజ్ తన పట్ల ప్రదర్శించిన వైఖరితో తాను చాలా ఇబ్బంది పడుతున్నట్లు షోయబ్ మాలిక్ తన మిత్రుల వద్ద అన్నట్లు చెబుతున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X