న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్ వీడియో: మాజీ ప్రియురాలిని కొట్టిన మారడోనా

By Srinivas

బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా, ఆయన మాజీ ప్రియురాలు రోకియో ఒలివియోకు చెందిన ఓ వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. డిగో మారడోనా తన ప్రేయసిని నెట్టివేసినట్లుగా, చేయి చేసుకున్నట్లుగా ఉన్న ఈ వీడియో అందర్నీ షాకింగ్‌కు గురి చేస్తోంది!

ఈ వీడియో నిడివి 30 సెకండ్లు ఉంది. ఇప్పుడు ఇది స్థానికంగా చర్చకు దారితీసింది. ఈ వీడియో అర్జెంటీనాలోని ఓ స్థానిక టీవీ ఛానల్‌లో తొలుత ప్రసారం అయింది.

ఇందులో ఇరవై నాలుగేళ్ల తన మాజీ ప్రేయసి రొకియో ఒవిలియోను పలుమార్లు డిగో మారడోనా చేయి చేసుకున్నాడు. తన పైన అతను చేయి చేసుకుంటున్న సమయంలో.. ఆగమని ప్రియురాలు పలుమార్లు మొరపెట్టుకుంది. అదే సమయంలో దీనిని ఆమె రహస్యంగా తన మొబైల్ ఫోన్లో వీడియా తీసింది. అయితే, తాను ఎప్పుడు కూడా చేయి చేసుకోలేదని మారడోనా చెప్పినట్లుగా తెలుస్తోంది.

 డిగో మారడోనా

డిగో మారడోనా

తన మాజీ ప్రేయసి రోసియా ఒలివీయా ఓ దొంగ అని అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా (53) కొద్ది రోజుల క్రితం అన్న విషయం తెలిసిందే. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒలీవియా తన డైమండ్ ఇయర్ రింగ్స్, వాచీలతో ఉడాయించిందని మారడోనా అంటున్నాడు.

డిగో మారడోనా

డిగో మారడోనా

మారడోనా ఆరోపణలను రోసియా ఓలీవియా తోసిపుచ్చింది. రెండు వారాల క్రితం వారిద్దరు కలుసుకుని రాజీకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అది ఫలించలేదు.

డిగో మారడోనా

డిగో మారడోనా

తనను అన్యాయంగా దొంగతనం కేసులో ఇరికించాడని ప్రియురాలి పేర్కొంది. తన బంగారు ఆభరణాలను మాజీ ప్రేయసి రోకియో ఓలివియా దొంగతనం చేసిందని డిగో మారడోనా ఆరోపణలు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పైన విడుదలైంది.

డిగో మారడోనా

డిగో మారడోనా

బెయిల్ పైన విడుదలైన సమయంలో మాట్లాడుతూ.. తాను డిగో మారడోనాకు సంబంధించిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లలేదని స్పష్టం చేసింది. తనను కావాలనే మారడోనా ఇరికించాడని చెప్పింది. తాను అతని వద్ద ఎలాంటి వస్తువులను దొంగలించలేదని తెలిపింది. తనను కావాలనే మారోడోనా ఇరికిస్తున్నాడని రోకియో కన్నీటి పర్యాంతమైంది.

 డిగో మారడోనా

డిగో మారడోనా

అనంతరం డిగో మారడోనా పైన డొమెస్టిక్ వయోలెన్స్ ఆరోపణలు వచ్చాయి. కాగా, మారడోనా, ఒలీవియా దుబాయ్‌లో కొన్నాళ్ళపాటు కలిసి జీవించారు.

డిగో మారడోనా

డిగో మారడోనా

తాజాగా, అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా, ఆయన మాజీ ప్రియురాలు రోకియో ఒలివియోకు చెందిన ఓ వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. డిగో మారడోనా తన ప్రేయసిని నెట్టివేసినట్లుగా, చేయి చేసుకున్నట్లుగా ఉన్న ఈ వీడియో అందర్నీ షాకింగ్‌కు గురి చేస్తోంది!

 డిగో మారడోనా

డిగో మారడోనా

ఈ వీడియో నిడివి 30 సెకండ్లు ఉంది. ఇప్పుడు ఇది స్థానికంగా చర్చకు దారితీసింది. ఈ వీడియో అర్జెంటీనాలోని ఓ స్థానిక టీవీ ఛానల్‌లో తొలుత ప్రసారం అయింది.

డిగో మారడోనా

డిగో మారడోనా

ఇందులో ఇరవై నాలుగేళ్ల తన మాజీ ప్రేయసి రొకియో ఒవిలియోను పలుమార్లు డిగో మారడోనా చేయి చేసుకున్నాడు. తన పైన అతను చేయి చేసుకుంటున్న సమయంలో.. ఆగమని ప్రియురాలు పలుమార్లు మొరపెట్టుకుంది. అదే సమయంలో దీనిని ఆమె రహస్యంగా తన మొబైల్ ఫోన్లో వీడియా తీసింది. అయితే, తాను ఎప్పుడు కూడా చేయి చేసుకోలేదని మారడోనా చెప్పినట్లుగా తెలుస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X