మెల్బోర్న్: టీమిండియా కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ముగుస్తుండటంతో కోచ్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీమిండియా కోచ్ రేసులో మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, రాహల్ ద్రవిడ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా, ఆస్టేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ కూడా టీమిండియా జట్టు కోచ్‌గా సౌరభ్ గంగూలీ నియామకం బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా గంగూలీ అయితే బాగా రాణిస్తాడని తెలిపాడు.
క్రికెట్ ఆస్టేలియాతో బ్రెట్ లీ మాట్లాడుతూ టెస్టులు, వన్డేలు, ట్వంటీ20 ఆడిన గంగూలీకి క్రికెట్ పరిజ్ఞానం అపారమైందని, అన్ని ఫార్మెట్లలోనూ ఆడిన అనుభవం అతడి సొంతమని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మంచి ఆటగాడిగా రాణించాడని పేర్కొన్న బ్రెట్ లీ, మంచి కోచ్‌గా తప్పక రాణిస్తాడని అన్నాడు.
క్రికెట్లో అతడికున్న అనుభవం గంగూలీని మంచి కోచ్‌ని చేస్తుందని, కోచ్‌గా సరైన సమతుల్యత కలిగి ఉండటం అత్యంత ప్రధానమని అన్నాడు. సౌరభ్ గంగూలీ భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాడని, కోచ్ పదవి గనుక దక్కితే తప్పక రాణిస్తాడని పేర్కొన్నాడు.
సౌరభ్ గంగూలీ (42) టీమిండియా తరుపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడి 18,575 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా టీమిండియాకు ఐదు సంవత్సరాలు సేవలందించిన గంగూలీ ఎన్నో మరిచిపోలేని విజయాలను భారత్‌కు అందించాడు.