న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు అల్విదా: సంగక్కరకు హై కమిషనర్ పదవి

By Pratap

కొలంబో: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న కొద్దిసేపటికే శ్రీలంక క్రికెట్ దిగ్జజం కుమార్ సంగక్కరను అత్యున్న పదవి వరించింది. ఇంగ్లాండులో శ్రీలంక హై కమిషనర్‌గా సంగక్కరను నియమిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ విషయాన్ని సోమవారంనాడు ప్రకటించారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు కుమార్ సంగక్కర సోమవారం వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, శ్రీలంక పరాజయంతో అతను క్రికెట్ క్రీడకు వీడ్కోలు పలకాల్సి రావడం కొద్దిగా కష్టమైన విషయమే. రెండో టెస్టు మ్యాచులో భారత్ శ్రీలంకపై 278 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించి.

Sri Lanka President offers UK High Commissioner's post to Kumar Sangakkara

ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా హాజరయ్యారు. సంగక్కర విజయాలను ఆయన ప్రశంసించారు. సంగక్కరను ఇంగ్లాండులో శ్రీలంక హై కమిషనర్‌గా నియమిస్తున్నట్లు వెంటనే ప్రకటించారు.

వీడ్కోలు చెబుతూ తీవ్ర ఉద్వేగానికి గురైన సంగక్కర సరిసేన తనకు ఇవ్వజూపిన పదవిపై మాట్లాడలేదు. సంగక్కర 15 ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచాడు. ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒక్కడిగా పేరు గాంచాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X