న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

18 ఓవర్లలోనే.. సౌతాఫ్రికా గెలుపు, శ్రీలంక ఇంటికి, సంగక్కర రికార్డ్ మిస్!

By Srinivas

సిడ్నీ: ప్రపంచ కప్‌లో భాగంగా తొలి క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక పైన సౌతాఫ్రికా విజయం సాధించింది. శ్రీలంక తమ ముందుంచిన 134 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి దక్షిణాఫ్రికా చేధించింది. ఆమ్లా (16), డికాక్ 57 బంతుల్లో 78 పరుగులు, డుప్లెసిస్ 31 బంతుల్లో 21 పరుగులు చేసి.. సౌతాఫ్రికాకు విజయం అందించారు. అంతకుముందు శ్రీలంక ఆలౌటయి 133 పరుగులు చేసింది.

కాగా, సంగక్కర మరో సంచరీ చేస్తే.. ఒకే ప్రపంచ కప్‌లో సచిన్ సెంచరీల రికార్డ్ సమం చేసేవాడు. కానీ శ్రీలంక ఓటమితో ఇంటికి వెళ్తోంది. ప్రపంచ కప్ నాకౌట్ దశలో తొలిసారి దక్షిణాఫ్రికా గెలిచింది. శ్రీలంక పైన తొమ్మిది వికెట్లతో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

Sri Lanka wins toss and will bat first against South Africa

40 పరుగులప్పుడు తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత వికెట్ కోల్పోలేదు. డికాక్, డుప్లెసిస్ 18 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించారు.

సౌతాఫ్రికా 40 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అమ్లా 23 బంతుల్లో 16 పరుగులు చేసి మలింగ బౌలింగులో కులశేఖరకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా తరఫున.. డికాక్, అమ్లాలు బ్యాటింగ్‌కు దిగారు. నాలుగు ఓవర్లలో 24 పరుగులు చేశారు. డికాక్ నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు.

సౌతాఫ్రికా లక్ష్యం 134 పరుగులు.

కాసేపటికి మ్యాచ్ ప్రారంభమైంది. శ్రీలంక 37.2 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయింది. మలింగ పదో వికెట్‌గా ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచ్‌కి వర్షం అడ్డుగా నిలిచింది. అంతకుముందు శ్రీలంక 127 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది.

127 పరుగుల వద్ద సంగక్కర అవుటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అవుటవుతున్నప్పటికీ.. సంగక్కర ఒంటరిపోరాటం చేశాడు. అతను 96 బంతుల్లో 45 పరుగులు చేసి.. మోర్కెల్ బౌలింగులో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

డుమిని హ్యాట్రిక్ సాధించాడు.

ఆ తర్వాత వెంటనే కులశేఖర వికెట్ పడిపోయింది. డుమినీ బౌలింగులో కులశేఖర (2 బంతుల్లో 1 పరుగు) డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. డుమిని బౌలింగులో కౌషల్ ఎల్బీగా వెనుదిరిగాడు. అతను పరుగులేమీ చేయలేదు. 116 పరుగుల వద్దనే శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది.

కేవలం రెండు పరుగు తేడాలోనే శ్రీలంక నాలుగు వికెట్లు (మాథ్యూస్, పెరీరా, కులశేఖర, కౌషల్) వికెట్లు కోల్పోయింది. 114 వద్ద మాథ్యూస్, 115 వద్ద పెరీరా, 116 పరుగుల వద్ద కులశేఖర, కౌషల్ వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత వెంటనే పెరీరే డకౌట్ అయ్యాడు. ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో రసౌకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు.

శ్రీలంక 33 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయింది. డుమినీ బౌలింగులో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి మాథ్యూస్ అవుటయ్య్డాడు. మాథ్యూస్ 32 బంతుల్లో 19 పరుగులు చేశాడు. శ్రీలంక 33 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. సంగక్కర 87 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

23.1 ఓవర్లలో శ్రీలంక కేవలం 81 పరుగులు మాత్రమే చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది. అటువైపు వికెట్లు పడుతుండటంతో సంగక్కర చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. అతను 59 బంతుల్లో 19 పరుగులు చేశాడు.

81 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో జయవర్ధనే డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

దూకుడుగా ఆడుతున్న తిరుమన్నే 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడో వికెట్‌గా అవుటయ్యాడు. ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇతను అవుటయ్యే సమయానికి శ్రీలంక స్కోర్ 69.

దీంతో శ్రీలంక నాలుగు పరుగులకే 4.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. తిరుమన్నే, సంగక్కర క్రీజులో ఉన్నారు.

శ్రీలంకకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పెరీరా 10 బంతుల్లో మూడు పరుగులు చేసి.. అబోట్ బౌలింగులో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత దిల్షాన్ ఏడు బంతుల్లో పరుగులేమీ చేయకుండానే స్టెయిన్ బౌలింగులో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ప్రపంచకప్‌లలో శ్రీలంక, దక్షిణాఫ్రికాలు నాలుగుసార్లు తలపడ్డాయి. 1992లో దక్షిణాఫ్రికాను శ్రీలంక ఓడించింది. 1999లో దక్షిణాఫ్రికా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2003లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. 2007లో దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. వన్డేల్లో శ్రీలంక 29-28తో దక్షిణాఫ్రికా పైన పైచేయితో ఉంది.

జట్లు

శ్రీలంక: కుషాల్ జనీత్ పెరీరా, దిల్షాన్, కుమార సంగక్కర (వికెట్ కీపర్), మహేల జయవర్ధనే, తిరిమానే, మాథ్యూస్ (కెప్టెన్), తిసారా పెరీరా, కులశేఖర, కుషాల్, మలింగ, చమీర

దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్ (వికెట్ కీపర్), డుప్లెసిస్, రోసో, డివిల్లియర్స్ (కెప్టెన్), మిల్లర్, డుమిని, స్టెయిన్, అబాట్, మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X