న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుదిర్మన్ కప్: ముగిసిన భారత్ పోరు, సింధు ఆడకుండానే ఓటమి

సుదిర్మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్ సమరం ముగిసింది. గ్రూపు దశలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్‌ శుక్రవారం చైనాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 0-3తో ఓటమి పాలైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: సుదిర్మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్ సమరం ముగిసింది. గ్రూపు దశలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్‌ శుక్రవారం చైనాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 0-3తో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

<strong>సుదిర్మన్ కప్: నాకౌట్‌కు భారత్, ఈ సారైనా చైనాపై విజయం సాధిస్తుందా? </strong>సుదిర్మన్ కప్: నాకౌట్‌కు భారత్, ఈ సారైనా చైనాపై విజయం సాధిస్తుందా?

తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు చైనా ఆటగాళ్లపై ఏ దశలోనూ సత్తా చాటలేకపోయారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భాగంగా చైనాతో జరిగిన క్వార్టర్స్‌ పోరులో భారత మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప, సాత్విక్‌ సాయిరాజ్‌ 16-21, 21-13, 21-16తో ప్రపంచ నెంబర్‌-2 జోడీ లూ కాయి, హుయాంగ్‌ యాకియాంగ్‌తో పోరాడి ఓడారు.

Sudirman Cup: India lose to China in quarter-finals

ఇక పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ రియో స్వర్ణ పతక విజేత చెన్‌ లాంగ్‌తో తలపడ్డాడు. 48 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో శ్రీకాంత్ 16-21, 17-21 ఓటమి పాలయ్యాడు. అతడి దూకుడు కొద్దిసేపటికే పరిమితం అయింది. యువ జంట సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ సెన్‌ 9-21, 11-21తో హైఫెంగ్‌, ఝంగ్‌ నాన్‌ జోడీ చేతిలో ఓడారు.

ఐదు మ్యాచ్‌ల ఈ పోరులో మొదటి మూడు మ్యాచుల్లో ఓడిపోవడంతో భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో పీవీ సింధు ఆడాల్సిన మహిళల సింగిల్స్‌, డబుల్స్‌ మ్యాచ్‌లు ఇక నామమాత్రంగా మిగిలాయి. తాజా పరాజయంతో లాంగ్‌ చేతిలో శ్రీకాంత్ 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనట్లు అయింది.

ఇదిలా ఉంటే థాయ్‌లాండ్‌, కొరియా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌ 3-2తో డెన్మార్క్‌పై, దక్షిణ కొరియా 3-1తో చైనీస్‌ తైపీపై విజయాలు సాధించాయి. సుదిర్మన్‌ కప్‌లో రెండు సార్లు నాకౌట్‌కు అర్హత సాధించిన భారత్‌.. చివరి సారిగా 2011లో క్వార్టర్స్‌ చేరుకుంది. అప్పుడు కూడా చైనా చేతిలో 3-1తో భారత్‌ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X