న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి స్థలం కేటాయింపు: సింధుకు టీ ప్రభుత్వం నజరానా

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం విజేత, బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధుకు గతంలో ప్రకటించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం నజరానాని అందజేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం విజేత, బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధుకు గతంలో ప్రకటించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం నజరానాని అందజేసింది. హైదరాబాద్ నగరంలోని షేక్‌ పేట్‌లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

షేక్‌పేట గ్రామంలోని భరణి లే అవుట్‌లో 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించినందుకు పీవీ సింధుకు 5 కోట్ల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telangana govt allocated to site for pv sindhu in hyderabad

అదేవిధంగా హైదరాబాద్‌ నగరంలో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని ఆమె చేస్తానంటే ప్రభుత్వంలో తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రియో ఒలింపిక్స్ అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే పీవీ సింధు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని క్యాంపు ఆఫీసులో కలిసింది.

Telangana govt allocated to site for pv sindhu in hyderabad

ఆ సమయంలో సింధుని సన్మానించిన కేసీఆర్‌ ఆమెకు చెక్‌ అందజేశారు. ఇప్పుడు ఆమెకు ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X